Jagan Drama Event

Jagan Drama Event: నో డౌట్‌.. దండుపాళ్యం బ్యాచ్‌..! విత్‌ ఫ్రూఫ్స్‌..

Jagan Drama Event: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామిడి రైతులను పరామర్శించేందుకు చేసిన యాత్ర, ఒక రాజకీయ జాతరగా మారింది. రైతులకు పరామర్శ పేరిట నడిచిన ఈ కార్యక్రమం, పక్కా స్క్రిప్ట్‌తో రూపొందించిన హైడ్రామాగా మారి, అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ పర్యటనలో వైసీపీ చేసిన వికృత చేష్టలు, రైతుల కష్టాన్ని అపహాస్యం చేసిన తీరు, పోలీసుల ఆంక్షలను ధిక్కరించిన ఘటనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

జగన్‌ పర్యటనకు ముందే వైసీపీ నాయకులు బంగారుపాళ్యంలోని చరన్‌ దాబా వద్ద మామిడి పండ్ల ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచారు. మార్కెట్‌లో అమ్మాల్సిన విలువైన మామిడి కాయలను జగన్‌ కాన్వాయ్‌ ముందు రోడ్డుపై పారబోసి, “రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అనే తప్పుడు ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. ఈ హైడ్రామాకు సంబంధించి ఏ ఏ ట్రాక్టర్లలో, ఎవరెవరు, ఎక్కడ పంటను పారబోయాలనే బాధ్యతలను నిన్నటి నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలకు అప్పగించారు. రైతుల సమస్యలను హైలైట్‌ చేస్తున్నట్లు చూపించేందుకు ఈ స్క్రిప్టెడ్‌ షోను రూపొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చేసిన చీప్‌ ట్రిక్‌గా అన్ని వర్గాల నుంచి ఖండనలు వస్తున్నాయి.

జగన్‌ మామిడి మార్కెట్‌ యార్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో, రైతుల స్థానంలో పచ్చ కండువాలు కప్పుకున్న వైసీపీ కార్యకర్తలు చేరి హల్‌చల్‌ చేశారు. నిజమైన రైతులకు ఎలాంటి పరామర్శ లేకుండానే, జగన్‌ మీడియా సమావేశం ముగించుకుని వెనుదిరిగారు. ఈ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను ధిక్కరించి, మార్కెట్‌ యార్డు గేట్లను తోసుకుని లోపలికి చొరబడ్డారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు 500 మందికి, హెలీప్యాడ్‌ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఉండగా, ర్యాలీలు, బహిరంగ సభలపై పూర్తి నిషేధం విధించిన పోలీసుల ఆదేశాలను వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. ఈ పర్యటనలో వైసీపీ కార్యకర్తల తీరు కాలకేయులను తలపించింది. మద్యం, గంజాయి మత్తులో “రప్ప రప్ప” డైలాగులతో రోడ్లపై గందరగోళం సృష్టించారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి మార్కెట్‌ సమీపంలో మద్యం, పుష్కా పంపిణీ చేయగా, మద్యం కోసం కార్యకర్తలు ఎగబడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరి తలకు గాయమైంది. ఈ గాయపడిన కార్యకర్తను బంగారుపాళ్యం ఎస్‌ఐ కుర్చీలో కూర్చోబెట్టి, తన కర్చీఫ్‌తో కట్టు కట్టారు. ఈ గందరగోళంలో జగన్‌ కాన్వాయ్‌ దిగొద్దని ఎస్‌పీ హెచ్చరించినప్పటికీ, గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకు జగన్‌ ప్రయత్నించారు. అయితే, ఈ సంఘటన కూడా రాజకీయ డ్రామాలో భాగమని విమర్శలొస్తున్నాయ్‌.

Also Read: MLC Kavitha: సీఎం చంద్రబాబుకు కవిత బహిరంగ లేఖ..!

Jagan Drama Event: జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల విధులకు అడుగడుగునా ఆటంకాలు కలిగించారు. రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన కార్యకర్తలు, ఒక డీఎస్పీపై దూసుకెళ్లిన చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జ్‌ విజయానంద్‌ రెడ్డి, మరో డీఎస్పీ చేయి నరికేయాలని కార్యకర్తలకు సూచించిన నాయకులు.. ఇలా పోలీసులపై జులుం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తోపులాటలో కొందరు మహిళలు కిందపడి గాయపడగా, పోలీసుల అప్రమత్తతో పెను ప్రమాదాలు తప్పాయి. గత పర్యటనలో కార్యకర్తలను కారు కింద తొక్కుకుంటూ వెళ్లిన జగన్‌, ఈసారి మామిడి పంటను రోడ్డుపై పోసి కార్యకర్తలతో తొక్కించారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ఈ చర్యలు, వైసీపీ సైకో చేష్టలకు నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. నిజమైన రైతులతో సంబంధం లేకుండా, వైసీపీ కార్యకర్తలతో ఈ ఈవెంట్‌ను నడిపిన జగన్‌, పరామర్శ యాత్రను ఒక రాజకీయ షోగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

పోలీసులు ఈ పర్యటనలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వైసీపీ కార్యకర్తలు సృష్టించిన గందరగోళం పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. తోపులాటలు, రెచ్చగొట్టే చర్యలు, పోలీసులపై జులుం చేసిన సంఘటనలు ఈ యాత్రను మరింత వివాదాస్పదం చేశాయి. అయితే పోలీసుల అప్రమత్తత వల్ల పెను ప్రమాదమేదీ జరగకపోవడంతో జిల్లా వాసులు ఊపిరిపీల్చుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *