Jagan Deyyam Matalu: లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు బొక్కేసి… ఇప్పడు నోట్ల కట్టలు దొరికాయా.. తమవి కావు అనేస్తే సరి.. అనుకుంటోంది వైసీపీ. చట్టానికి చిక్కినా బుకాయిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్‌లో 12 అట్టపెట్టెల్లో దొరికిన 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదంటున్నాడు ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డి. ఎన్నికల సమయంలో గరికపాడు చెక్ పోస్టు వద్ద దొరికిన 8 కోట్ల 37 లక్షలు తమవి కావని చెబుతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికిన డబ్బు చార్టర్డ్ ఫ్లైట్స్‌లో తిరుగుతున్న చెవిరెడ్డి స్కామ్ మేట్ చెరుకూరు వెంకటేష్ నాయుడు ఇంటి నుంచి తరలించినవే అని సిట్ వద్ద పక్కా ఆధారముంది.
సిట్ చెబుతున్న దాని ప్రకారం…. చెవిరెడ్డి తన వద్ద 12 ఏళ్లకు పైగా గన్‌మెన్‌గా పనిచేస్తున్న నమ్మకస్థుడిగా ఉన్న కానిస్టేబుల్ గిరిబాబుకు టాస్క్ అప్పగించి, తన పీఏ నవీన్, బాలాజీ యాదవ్‌లతో పాటు హైదరాబాద్‌లోని వెంకటేష్ నాయుడు వద్దకు పంపాడు. వారు నేరుగా చెరుకూరి వెంకటేష్ నాయుడు నివాసం ఉంటున్న బంజారాహిల్స్‌లోని క్రిషి వాలీ అపార్ట్మెంట్‌లో ఉన్న ముడుపుల డెన్‌కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేదీకి సరిగ్గా వారం రోజుల ముందు… ఈ క్రిషి వాలీ నుంచి వరుసగా మూడు సార్లు… మే 6, 7, 8 తేదీల్లో చెరుకూరు వెంకటేష్ నాయుడు ఇంటి నుంచి ఏపీకి డబ్బు తరలించారు. డబ్బులు కార్డ్ బోర్డ్ బాక్సుల్లో పెట్టి ట్రిప్పుకు 8-9 కోట్లు తరలించారు. అలా 8వ తేదీన లారీలో తరలిస్తున్న డబ్బు 8 కోట్ల 37 లక్షలు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడింది. పోలీసులు పట్టుకోగానే గన్ మెన్ గిరిబాబు చెవిరెడ్డికి ఫోన్ చేశారు. గిరిబాబును ఫోన్ పగులగొట్టేసి చెన్నై లేదా ఎక్కడికైనా వెళ్లిపొమ్మని చెప్పారు చెవిరెడ్డి. దాంతో గిరిబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో తిరిగొచ్చాడు. ఈ మొత్తం వివరాలన్నీ కాల్ డేటా, లొకేష్ ఆధారంగా సేకరించింది సిట్. నిందితులు వివిధ సందర్భాల్లో ఎక్కడెక్కడ కలుసుకున్నారో కూడా సిట్ ఆధారాలతో సహా ఫ్రేమ్ చేసి ఉంచింది.
Also Read: Donald Trump: మరోసారి భారత్కు ట్రంప్ వార్నింగ్
ఇక చెరుకూరి వెంకటేష్ నాయుడు తన డెన్‌లో నోట్ల కట్టలు లెక్కబెడుతున్న వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది కదా.. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో రిలీజ్ కాగానే వెంకటేష్ నాయుడిని కూడా వదిలించుకుంది వైసీపీ. అతనితో తమకు సంబంధం లేదని, అతను టీడీపీ మనిషే అని తమకు అలవాటైన పంథాలోనే వ్యవహరిస్తోంది. అసలు ఎవరీ వెంకటేష్ నాయుడు. చెవిరెడ్డికి దోస్త్, గ్లాస్ మేట్, స్కామ్ మేట్.. అన్నీ అతడే. ఒంగోలు లోక్ సభకు పోటీ చేసిన చెవిరెడ్డికి డమ్మీ క్యాండెట్‌గా నామినేషన్ వేశాడంటే.. చెవిరెడ్డికి అతను సొంత మనిషి అని అర్థమవడం లేదా. అంతేకాదు.. చెవిరెడ్డి ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బు మొత్తం వెంకటేష్ నాయుడు డెన్ నుండి తరలించిన సొమ్మే అని తెలుస్తోంది. ఇక పలు సందర్భాల్లో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు కలిసిన వివరాలను సిట్ వెల్లడించింది కూడా. 2024 జనవరి 27న చెవిరెడ్డి (96766 99999), వెంకటేష్ నాయుడు (99854 44555) బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని సితారా గ్రాండ్‌లో ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. చెవిరెడ్డి ఆదేశాలతో ఎన్నికల సమయంలో డబ్బు చేరవేతలో కీలకంగా వ్యవహరించింది బాలాజీ యాదవ్, నవీన్, గిరిబాబు. వీరికి ముడుపులను అందించింది సిమన్, వెంకటేష్ నాయుడు, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, ప్రణోయ్ ప్రకాష్. వీరంతా కూడా వివిధ సందర్భాల్లో ఒకే దగ్గర ఉన్నట్లు కాల్ డేటా ఆధారంగా సిట్ తేల్చింది.
వైసీపీ మొండిగా వాదిస్తున్నట్లు రాజ్‌కసి రెడ్డి తమ వ్యక్తి కాకుంటే అతని ఫోన్ లొకేషన్ విజయసాయిరడ్డి ఇంటి వద్ద ఎందుకు ట్రేస్ అయ్యింది. వెంకటేష్ నాయుడు తమ వ్యక్తి కాకుంటే.. అతను, చెవిరెడ్డి ఒకే టైమ్‌లో గ్రాండ్ సితారలో ఎందుకున్నట్లు. సో… వైసీపీ చేసే వాదనలకు తలా తోక ఉండదు. తమని గుడ్డిగా ఫాలో అయ్యే వారి కోసమే ఆ పార్టీ అలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటుందని అర్థమౌతోంది.