Liquor Scam: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల లిక్కర్ ముడుపుల స్కామ్ దేశాన్నే కుదిపేస్తోంది. ఇక సిట్ విచారణలో వెలుగుచూస్తున్న విషయాలు అయితే.. ఇంటర్నేషనల్ మాఫియాను సైతం తలదన్నేలా ఈ స్కామ్ నడిచిందని వెల్లడి చేస్తున్నాయి. ఎప్పుడూ చూడని, ఎక్కడా పేరు కూడా వినని వ్యక్తులతో పాటూ, అధికారులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన ఈ లిక్కర్ స్కామ్.. ఇదివరకు ఎన్నడూ చూడని ఇండియాలోనే బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్‌గా రికార్డులకెక్కుతోంది. జాతీయ మీడియా, జాతీయ పార్టీలు సైతం అవాక్కవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే.. సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. సినిమా ట్రైలర్‌ని తలదన్నేలా ఈ వీడియో ఉండటంలో సోషల్‌మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also Read: India-Canada: భారత్-కెనడా దౌత్య సంబంధాలకు కొత్త ఊపిరి
మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ లిస్కర్ స్కామ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది వైసీపీ. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పోగేసుకున్న వైనం ఆధారాలతో సహా వెలుగుచూస్తోంది. ఏ టు జెడ్.. అంతా సొంత మనుషుల్నే నియమించుకుని చేసిన స్కామ్‌లో.. అక్రమంగా సంపాదించిన దొంగ సొమ్మును.. గోల్డ్, హవాలా, సినిమా, ఎలక్షన్.. ఇలా రకరకాల మార్గాల్లో మళ్లించినట్లు అర్థమౌతోంది. జే బ్రాండ్లు తాగి లివర్లు, కిడ్నీలు పోగొట్టుకున్నది ఎందరో..!
ఎన్ని వేల కుటుంబాలు ఆ ఒక్కడి ధనదాహానికి బలయ్యాయో..! అద్ధం పడుతోంది ఈ సంచలన వీడియో.