Home Minister Anita

Home Minister Anita: ‘హోం’లో పాతుకుపోతున్న అనిత!

Home Minister Anita: వంగలపూడి అనిత హోం మంత్రి పదవి చేపట్టినప్పుడు తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు స్వాగతించారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు నరకం చూసిన వాళ్లు.. కరెక్ట్‌ పర్సన్‌ చేతికి హోం మినిస్ట్రీ ఇచ్చారంటూ సమర్థించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు హోం మంత్రి అనిత. ఆమె నేతృత్వంలో ఏపీలో సోషల్‌ మీడియా అరెస్టులు ఎంతటి సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. సోషల్‌మీడియా ఉన్మాదానికి స్వయంగా ఆమె కూడా ఓ బాధితురాలు కావడంతో.. వేట మొదలు పెట్టి, ఒక్కో సోషల్‌ సైకోని ఏరి పారేశారు. టీడీపీ కార్యకర్తలు లైన్‌ క్రాస్‌ చేసినా ఒకటే పనిష్మెంట్‌ అని నిరూపించారు. టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ వైఎస్‌ భారతిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే.. అవి వైరల్‌ అయిన గంటల్లోనే కిరణ్‌ని కటకటాల్లోకి పంపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైరస్‌ వ్యాపించినట్లుగా హత్యాచారాలు, అత్యాచార ఘటనలు చోటు చేసుకన్నాయి. దాంతో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ తరహా ఘటనల్ని సమర్థవంతంగా అణచి వేసింది కూటమి ప్రభుత్వం. ఇందులో హోం మంత్రి అనిత పాత్ర కీలకం. ఎక్కడ మహిళలపై దాడులు జరిగినా, వెంటనే స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లిపోయేవారు అనిత. బాధితులకు భరోసా కల్పించడంలో మానవత్వంతో స్పందించేవారు. నిందితులు ఎక్కడున్నా వేటాడి వీలైనంత వేగంగా అరెస్ట్ చేయడంలో పగడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ అత్యాచార ఘటనల కారణంగా ఒకానొక దశలో ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌పై విస్తృతమైన చర్చ జరిగింది. వైసీపీ అయితే చిలువలు పలువలు చేసి ఏకరువు పెట్టేది.

Also Read: Raw Agent: పాకిస్తాన్‌లో ఆర్మీ లో భారతదేశపు గూఢచారి..

Home Minister Anita: ఏకంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. హోం శాఖ సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో హోం మంత్రి అనిత చూపిన రాజకీయ పరిణతి తలపండిన రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఆమె తన సహజ శైలికి భిన్నంగా.. పొత్తు ధర్మానికి కట్టుబడి, సున్నితంగా, చాలా చాకచక్యంగా స్పందించారు. డిప్యూటీ సీఎంకి అత్యంత గౌరవమిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ సూచనలు పాటిస్తానని, సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో మరింత సమర్థవంతంగా పని చేస్తాననని రాజనీతిజ్ఞత ప్రదర్శించారు వంగలపూడి అనిత. అలా అన్ని వేళ్ళూ తన వైపే చూపిస్తున్న సమయంలో.. ఏ మాత్రం తొట్రుపాటుకు గురి కాకుండా తాను చేయాల్సిందేంటో తెలుసుకుని యాక్షన్‌లో దిగిపోయేవారు. పనిలో ఎంతో వేగం చూపిస్తూ కేవలం రోజుల వ్యవధిలోనే తన మార్క్ ఏంటో చూపించే ప్రయత్నం చేశారు.

ALSO READ  Short News: ఏపీ క్యాబినెట్‌

ఇక హోం మంత్రిగా పనిచేయని పోలీసుల విషయంలో ఆమె కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత, కొద్ది గంటల్లోనే కడప పోలీసులు అతనికి 41ఎ నోటీసును ఇచ్చి విడుదల చేయడం విమర్శలకు దారి తీసింది. దాంతో వెంటనే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ హోం మంత్రి హోదాలో అనిత ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన శాఖలో దూకుడుని చూపించారు. అంతే కాదు కేవలం డెబ్బై రెండు గంటల వ్యవధిలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం కూడా హోం శాఖ దూకుడు ఏ రేంజ్‌లో ఉందో తెలియజేసింది. విధులు సక్రమంగా నిర్వహించని అధికారుల మీద కఠిన చర్యలు ఉంటాయని హోం మంత్రి తన చేతల ద్వారా స్పష్టం చేశారు. తాను మాటల మనిషిని మాత్రమే కాదని చేతల మనిషిని అని, అవసరం అయితే ఎంత కఠినంగా ఉండగలనో కూడా ఆమె తన యాక్షన్ ద్వారా రుజువు చేస్తున్నారు.

Also Read: Simhachalam Tragedy: సింహాచలం ఘటనలో ఐటీ దంపతులు సహా కుటుంబంలో నలుగురు మృతి

Home Minister Anita: ఇక వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ప్రతి సందర్భంలో కూడా లా అండ్‌ ఆర్డర్‌నే టార్గెట్‌ చేసుకుంటోంది. ఇటీవల జగన్‌ రాప్తాడు పర్యటన ఇందుకో ఉదాహరణ. జగన్‌కి రక్షణ లేదని, ఆయన పర్యటనలకు బందోబస్తు కల్పించడంలో కూటమి సర్కార్‌ విఫలమౌతోందని నిందలు మోపే ప్రయత్నం ప్రతిసారీ చేస్తూనే ఉంది వైసీపీ. అయితే వైసీపీ ప్లే చేసే డ్రామాలలో వాస్తవమెంతో, కట్టు కథలేంటో ఆధారాలతో సహా ఎండగడుతోంది హోం శాఖ. రాప్తాడులో జగన్‌ హెలీకాప్టర్‌ ఘటనకు సంబంధించి, చిప్సాన్‌ ఏవియేషన్‌ సంస్థకు, పైలట్‌, కోపైలట్‌లకు నోటీసులిచ్చి విచారణకు పిలిపించడం ద్వారా.. వైసీపీ పరువును రోడ్డుపై నిలబెట్టింది హోం మంత్రి వంగలపూడి అనిత. ఇక వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వంపై చేస్తోన్న అడ్డగోలు ఆరోపణలు, విమర్శల్ని తిప్పికొట్టడంలో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రలు వెనకబడ్డారనీ, వైసీపీ ఓ వైపు ప్రభుత్వంపై బురదజల్లుతున్నా ధీటుగా సమాధానం చెప్పేవారే కరువయ్యారని విమర్శలొస్తున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయమై మంత్రులకు ఇటీవల క్లాస్‌ పీకారు. అయితే వంగలపూడి అనిత మాత్రం ఆ లిస్ట్‌లో లేనేలేరు. ఎందుకంటే వైసీపీ ఓ కొత్త గేమ్ ప్లాన్‌తో ముందుకొచ్చిన ప్రతిసారీ.. ప్రెస్‌మీట్లు పెట్టి వైసీపీని ఏకిపారేస్తున్నారు హోం మంత్రి వంగలపూడి అనిత.

ALSO READ  Mahaa Vamsi: మహాన్యూస్ కు సున్నా..సాక్షికి 403 కోట్లా !

హోం శాఖను నడిపించడం అంటే సవాల్‌తో కూడుకున్న పని. అది కూడా వైసీపీ లాంటి పార్టీలున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ శాఖను డీల్‌ చేయడం అంటే ఛాలెంజింగే. శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడే హోం శాఖలో… ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు భారీ అనర్థాలకు దారి తీస్తాయి. అలాగని ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి క్లిష్టమైన శాఖని.. ఆవేశాన్ని, ఆలోచనని బ్యాలెన్స్‌ చేస్తూ.. దళిత మహిళగా, సాధారణ కార్యకర్త స్థాయి నుండి పైకొచ్చిన వంగలపూడి అనిత సమర్థవంతంగా నిర్వహిస్తుండటం.. నిజంగా మెచ్చుకోదగిని విషయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *