Guntur West YCP Hadal

Guntur West YCP Hadal: ఆ నియోజకవర్గం పేరు చెబితేనే పారిపోతున్నారా?

Guntur West YCP Hadal: రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో 174 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిని నియమించిన వైసీపీ అధిష్ఠానం, ఆ నియోజకవర్గం విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఇన్‌చార్జిని నియమించలేదు. దానికి కారణం, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండడానికి ఏ ఒక్క నేతా ముందుకు రాకపోవడం. ఆ నియోజకవర్గం పేరు చెబితేనే వైసీపీ నేతలు పారిపోతున్నారట. వైసీపీ నేతలను అంతలా భయపెడుతున్న నియోజకవర్గం ఏంటా అనుకుంటున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం.

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో రాష్ట్ర విభజనకు ముందు, విభజనకు తర్వాత అనే విధంగా మారిపోయాయి రాజకీయ పరిస్థితులు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ఇక్కడ వైసీపీ బోణీ కొట్టలేదు. రాష్ట్ర విభజనకు ముందు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గెలిచి, మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోటగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లేళ్ల అప్పిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు. ఇక 2019లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన చంద్రగిరి ఏసురత్నంపై సైతం టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరి గెలిచారు.

Also Read: Bandi sanjay: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

Guntur West YCP Hadal: 2024లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విడదల రజినీ.. టీడీపీ బీసీ మహిళా అభ్యర్థి గల్లా మాధవిపై 51 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. 2014, 2019 పరిస్థితి ఎలా ఉన్నా, ఈ నియోజకవర్గ సీటు విషయంలో 2024లో వైసీపీ అధిష్ఠానం తగిన జాగ్రత్తలు తీసుకుంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే, జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న రజినీని బరిలో దించింది. రజినీ సైతం తన గెలుపు సామ దాన భేద దండోపాయాలను వాడారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న నేరెళ్ల సురేష్‌తో పాటూ… నేడు రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న పలువురు టీడీపీ నేతలను సైతం కొనుగోలు చేశారని టాక్ నడిచింది. అయితే.. ఎంత చేసినా రజినీని, వైసీపీని వెస్ట్ ప్రజలు ఆదరించలేదు.

నియోజకవర్గ ఎమ్మెల్యేగా గల్లా మాధవి గెలుపు తర్వాత రజినీ తిరిగి పేటకు రిటర్న్‌ టికెట్‌ తీసుకున్నారు. దీంతో సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్‌చార్జి లేరు. లేళ్ల అప్పిరెడ్డి, అంబటి లాంటి వారిని ఇన్‌చార్జిగా నియమించాలని చూసినా, వాళ్లు “మా కొద్దు నాయనో ఈ నియోజకవర్గం” అని పారిపోయారట. మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా రావడానికి ఆసక్తి చూపి, టీడీపీ నాయకులతో చేతులు కలిపి మేయర్ పదవి నుంచి దిగిపోయాడనే ఆరోపణలతో.. కావటిని కూడా వైసీపీ అధిష్ఠానం దూరం పెట్టింది. చూడాలి మరి, ఇప్పటికైనా ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జి దొరుకుతారో లేదో.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *