Guntur Varasula Politics

Guntur Varasula Politics: వైసీపీ సంక్షోభం నుండి పుట్టుకొచ్చిన కొత్త నాయకత్వం

Guntur Varasula Politics: ఏపీ రాజకీయ ముఖచిత్రంలో గుంటూరు జిల్లాది పత్యేక స్దానం. 17 నిమోజకవర్గాలు ఉన్న ఈ జిల్లాలో మోజారిటీ స్దానాలను ఎవరు కైవసం చేసుకుంటే అధికారం ఆ పార్టీనే వరిస్తుందని ఓ నానుడి కూడా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి 15 స్దానాలను గెలిచిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే…. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 17 సీట్లు గెలిచిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జిల్లా టీడీపీ నాయకులను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, చేసిన అవమానాలకి ఉమ్మడి ఏపీలోనే పోరాట యోధుడిగా పేరు పొందిన మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు సైతం బలవన్మరణం పొందారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్స్‌గా పేరు పొందిన ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు ఇతర టీడీపీ నేతలు ఫేస్‌ చేసిన ఇబ్బందులు తక్కువేమీ కాదు.

సంక్షోభం నుంచే కొత్త నాయకులు పుట్టుకొస్తారంటారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనిటీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, జైలులో పెట్టినప్పుడు అన్నీ తామై ముందు వరుసలో నిలబడ్డారు వారి వారసులు. వారే దూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వై.దీప్తి, యరపతినేని శ్రీనివాస్‌ కుమారుడు నికిల్, పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ బాబు.

Also Read: Peddi Reddy Swarnalatha: లక్షలాది తల్లులు, భార్యల కన్నీటికి ఏం సమాధానం చెప్తారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ధూళిపాళ్ల కుటుంబ పాత్ర కీలకమైనది. తండ్రి దూళిపాళ్ల వీరయ్య చౌదరి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆ పార్టీకి బలమైన వాయిస్‌గా అపోజిషన్ పార్టీకి చెమటలు పట్టించడంలో దూళిపాళ్ల నరేంద్ర దిట్ట. అలాంటీ నరేంద్రని వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నరేంద్రని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచడం ఒక ఎత్తయితే… ఆయన జైలులో ఉన్న టైంలో ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ప్రపంచస్దాయిలో గుర్తింపు పొందిన సంగం డైరీని స్వాధీన పరుచుకోవడానికి వైసీపీ నాయకులు చేసిన కుటిల రాజకీయాలు మరో ఎత్తు. అలాంటి సమయంలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు, సంగం డైరీపై ఆధారపడిన వేలాది మంది రైతాంగానికి నేనన్నాననే భరోసా ఇచ్చారు నరేంద్ర కూతురు వై.దీప్తి. చిన్న వయస్సులోనే ఒక పక్క నియోజకవర్గ టీడీపీ క్యాడర్, మరో పక్క సంగం డైరీపై ఆధారడిన రైతులు, ఉద్యోగులతో నిత్యం రివ్యూలు చేస్తూ.. నేనున్నాననే భరోసా ఇచ్చారు. ఆ టైంలో వైసీపీ నాయకులు సంగం డైరీని టచ్ చేయలేని విధంగా పావులు కదిపారు దీప్తి. మరోవైపు నియోజకవర్గ క్యాడర్‌తో నిత్యం మాట్లాడుతూ వారిలో ఆత్మ స్థ్యైర్యం నింపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలు.. 25 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన నేపధ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 నుంచి 8 స్దానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వై.దీప్తి ఏదో ఒక నియోజకవర్గం నుండి బరిలో దిగడం పక్కాగా కనిపిస్తోంది.

Also Read: Nimisha Priya Case: నిమిష ప్రియ కేసులో ట్విస్ట్: ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం ప్రభుత్వ వర్గాల వెల్లడి

సంక్షోభంలో భయటకు వచ్చిన మరో యువనేత యరపతినేని నికిల్. వైసీపీ ప్రభుత్వం యరపతినేని శ్రీనివాస్‌ని గట్టిగానే టార్గెట్ చేసింది. సీబీఐ కేసులు పెట్టి వేధించాలని చూసింది. ఆ టైంలో గురజాల నియోజకవర్గ క్యాడర్‌కి నేనున్నానని సపోర్ట్‌గా నిలిచారు యరపతినేని కుమారుడు నికిల్. 2014-2019 టీడీపీ అధికారంలో ఉన్న టైంలోనే క్యాడర్ కష్టనష్టాల్లో పాల్గొన్న నికిల్.. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో నియోజకవర్గ క్యాడర్‌కి అన్నీ తానై నిలబడ్డారు. వైసీపీ రాక్షస పాలన కారణంగా పల్నాడు జిల్లాలోని పల్లెలు ఖాళీ కాకుండా చూడటంలో నికిల్ కీలక భూమిక పోషించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యరపతినేని రాజకీయ వారసుడిగా నికిల్ రావాలని కోరుకుంటున్నారు పల్నాడు ప్రజానీకం.

వైసీపీ అక్రమ కేసుల కారణంగా బయటకు వచ్చిన మరో యువనేత పత్తిపాటి శరత్ బాబు. టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యాక్షుడు, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తనయుడే ఈ శరత్ బాబు. రాష్ట్ర రాజకీయాల్లో పత్తిపాటి పుల్లారావుది కీలక స్దానం. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పత్తిపాటి ఏ రోజూ రాజకీయాల్లో తన వారసులను పరిచయం చేయలేదు. అయితే జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ అరెస్ట్ కారణంగా శరత్ బాబు పేరు తెరమీదకు వచ్చింది. సంబంధం లేని కేసులో శరత్‌ని ఇరికించాలని చూసింది వైసీపీ. అయితే శరత్ బాబు న్యాయస్దానంలో క్లీన్ ఇమేజ్‌తో బయటకు వచ్చారు. దీంతో పత్తిపాటి రాజకీయ వారసుడు వచ్చాడని పల్నాడు జిల్లా టీడీపీ క్యాడర్ సంతోషించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సుధీర్ బాబు సైతం ఏదో ఒక నియోజకవర్గం నుండి బరిలో దిగే అవకాశం లేకపోలేదు.

వీరితో పాటు కొమ్మాలపాటి, జీవీ ఆంజనేయులు వారసులు సైతం బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. ఇక మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు వారసుడు కోడెల శివరాం ఇప్పటికే పార్టీలో కీలక రోల్‌ పోషిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్ రాజకీయాల్లో వీరిలో కింగ్‌గా మారేదెవరో…!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *