CRDA Building Specialty: రాజధాని అమరావతి ప్రాధికార సంస్థ సీఆర్‌డీఏ అమరావతిలో తన నూతన భవన నిర్మాణం పూర్తి చేసుకుంది. రాజధానిలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిన శాశ్వత భవనంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకుంటున వేళ అమరావతిలో సీఆర్డిఏ భవనం నిర్మాణం పూర్తయి, ప్రారంభించడం కీలకంగా మారింది. సీడ్ యాక్సెస్ రోడ్ ఆనుకోని రాయపూడి వద్ద సీఆర్డిఏ నూతన భవనం ఏర్పాటు చేశారు. సుమారు 4.32 ఎకరాల్లో ఈ భవన నిర్మాణం చేపట్టింది సీఆర్డిఏ. 2018 లోనే ఈ భవనం నిర్మాణం ప్రారంభం అయినా.. వైసిపి పాలనలో పూర్తిగా పనులు నిలిచిపోవడంతో.. మరలా కుటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పనులు తిరిగి ప్రారంభించి.. సర్వాంగ సుందరంగా భవనం నిర్మించారు.
Also Read: CBI: జగన్ విదేశీ పర్యటనపై కోర్టును ఆశ్రయించిన సీబీఐ
సుమారు 250 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన సీఆర్డిఏ నూతన భవనం జీ ప్లస్ 7 అంతస్తుల భవనంగా నిర్మితమైంది. నూతన కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్, క్యాంటిన్ నిర్మాణం చేపట్టారు. రిసిప్షన్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు నిర్మించారు. 2,3,5 అంతస్తుల్లో సీఆర్డిఏ అధికారులు, సిబ్బంది కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇక 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరెట్ కార్యాలయం, 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంతో పాటు మున్సిపల్ శాఖ హెచ్‌వోడీల కార్యాలయాలు ఉన్నాయి.
ఇక భవనం ముందు భాగం మధ్యలో అమరావతి సింబల్ అయిన A అక్షరం వచ్చేలా డిజైన్ చేశారు. 300లకు వరకు కార్ల పార్కింగ్, అలాగే 300 వరకు 2 వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. భవనం ముందు భాగంలో 100 అడుగుల ఎత్తులో ఎత్తైన జాతీయ జెండా ఏర్పాటు చేశారు. అలాగే పూర్తి స్థాయిలో అధునాత వీధి లైట్లు ఏర్పాటు చేశారు. చూట్టూ పచ్చని చెట్లు ఏర్పాటు చేశారు. ఇక పై ఈ భవనం నుండే రాజధాని పనులు పర్యవేక్షించున్నారు అధికారులు. రాజధాని రైతులు ఇప్పటి వరకు విజయవాడలోని సిఆర్డిఏ కార్యాలయం వద్దకు రావాల్సి వచ్చేది. ఇకపై రైతులకు తమ ప్రాంతంలోనే సీఆర్డిఏ కార్యాలయం రావడంతో ఆనందం వక్తం చేస్తున్నారు. ఇకపై అమరావతి పర్యటనకు వచ్చే విదేశీయులకు, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు ఈ కార్యాయలంలో మీటింగులు, అనంతరం రాజధాని ప్రాంతంలో పర్యటనలకు మరింత సులువు కానుంది.