Common Man CM CBN: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సంచలనమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతుంటాయి. తెలంగాణలో ఏం జరిగినా, ఏపీలో ఏం జరగకపోయినా, అందుకు చంద్రబాబే కారణమని అంటారు. ఆయన రాజకీయ శైలి, పనితీరు, ప్రజలతో మమేకం కావడం – ఇవన్నీ ఆయనను ఒక పొలిటికల్ ఐకాన్‌గా నిలిపాయి. టీడీపీ క్యాడర్‌కు ఆయన స్ఫూర్తి. కష్టపడి ఎదగాలనే తపనకు చిహ్నం. అయితే, ఆయనను వ్యతిరేకించే వారు ఆయనను బూచిగా చిత్రీకరిస్తుంటారు. ఇలా, ఆయన పేరు రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది.
చంద్రబాబు రాజకీయం చాలా సింపుల్‌గా, స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. ఆయన దూకుడుగా వ్యవహరిస్తారు కానీ, వ్యక్తిగత దూషణలకు దిగరు. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తారు, వ్యక్తిగత వైరంగా చూడరు. ఈ విధానం వల్లే లైక్‌మైండెడ్ వ్యక్తులు చంద్రబాబును అంతలా ఆరాధిస్తుంటారు. దీనికి భిన్నంగా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయం దాడులు, దౌర్జన్యాలు, రౌడీషీటర్ల పరామర్శలపై ఆధారపడి నడుస్తోంది. ఒకవైపు చంద్రబాబు – ప్రజల మధ్య ఉంటూ, సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారాలు చూపిస్తున్నారు. మరోవైపు జగన్ – ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో బంధీగా, ఆత్మవిమర్శ లేని నాయకుడిలా మిగిలారు.
జగన్ రాజకీయాల్లో ఎక్కడా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించడం లేదు. ఏదో జరిగిపోతోంది అంటూ లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు క్రియేట్ చేయాలని, దాన్నే నిజమని ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేని విధంగా ప్రజలకు మరింత దగ్డరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన పూర్తిగా డిఫరెంట్ స్టయిల్ అనుసరిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక ఊరిలో పింఛన్ల పంపిణీలో స్వయంగా పాల్గొనడం అందులో భాగమే. పీ4 పథకాన్ని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని వేదికగా మార్చుకుంటున్నారు. P4 బంగారు కుటుంబం పథకం ద్వారా ఆర్థిక సాయం మాత్రమే అందిస్తే సరిపోదని, పేదల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పేద కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని, వారి ఎదుగుదలకు అవసరమైన విధానాలపై ఆలోచిస్తూ… ప్రతిదీ పీ4కి అన్వయిస్తున్నారు. ఒక బార్బర్, చర్మకారుడు లాంటి వృత్తుల్లో ఉన్న పేదలతో తాను సమానంగా కూర్చుని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం.. కొత్తగా అనిపిస్తోంది. ఈ సింప్లిసిటీ, సామాజిక బాధ్యత చంద్రబాబును ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
Also Read: Mahaa Conclave On Education: లోకేష్ చోరవతో విద్యాశాఖలో భారీ మార్పులు
Common Man CM CBN: చంద్రబాబు రోజువారీ షెడ్యూల్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సమావేశాలు, పర్యటనలు, ప్రజలతో సంభాషణలు… 24 గంటల్లో ఇన్ని పనులు ఎలా సాధ్యం? అనిపిస్తుంది. ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకుని, దాన్ని పాలనలో అమలు చేసే ఆయన శైలి యువతకు ఓ సవాల్. ఓటమి వచ్చినా, గెలుపు వచ్చినా, ఆయన పనితీరులో మార్పు ఉండదు. రాజకీయ తప్పిదాలను సరిదిద్దుకుని, పార్టీకి మార్గదర్శనం చేస్తారు. జగన్ మాత్రం ఓటమి తర్వాత కూడా అహంభావంతో, ఆత్మవిమర్శ లేకుండా, తప్పు దారిలో పార్టీని నడిపిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగానే వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఉదహరిస్తున్నారు. మోడీతో సంబంధాలు బలపరుచుకుంటూ, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ ఏపీ సీఎం ముందుకు సాగుతున్నారు. ఆయన రాజకీయం ఒక కేస్ స్టడీ అయితే… జగన్ నడుచుకుంటున్న విధానం ఒక హెచ్చరిక అంటున్నారు అనలిస్టులు.