Chandram Mastaru: జూలై 10. గురుపూర్ణిమ. గురుశిష్యుల బంధానికి ప్రవిత్రమైన రోజు. ఆరోజు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు బడులలో, జూనియర్ కాలేజీలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అద్భుతంగా విజయవంతమైంది. గతంలో ఏపీలో ఎన్నడూ కనిపించని కొత్త ఒరవడి ఇది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఉపాధ్యాయుడిగా మారి తరగతి గదిలో పాఠాలు బోధించడం.. విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. విద్యార్థుల్ని తమ సభలకు తరలించడం కాదు. ముఖ్యమంత్రి, మంత్రులే విద్యార్థుల వద్దకు వెళ్లడం కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒకటిగా నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు అందించారు. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలలో ఉద్ధండుడైన చంద్రబాబు 8వ తరగతి విద్యార్థులకు 45 నిమిషాల పాటు నిలబడి సామాజిక శాస్త్రం, వనరులు, వాటి వినియోగం, బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజంలోని వనరులను ఎలా వినియోగించాలో విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు అంతే ఉత్సాహంగా ఆలకించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. విద్యలో వారు మరింత రాణించాలని, కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో చేరి సమాజ సేవ చేయాలని ప్రోత్సహించారు.
డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి, నీతితో కూడిన విజ్ఞాన సమాజాన్ని నిర్మించాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ వివరించారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని విద్యార్థుల్లో కాంపిటీటివ్ స్పిరిట్‌ని నింపారు. విద్యార్థుల ఆరోగ్యం, ప్రవర్తన, చదువుపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు సూచించారు. “డ్రగ్స్ వద్దు బ్రో… డు నాట్ బి ముఖేష్” అనే స్లోగన్‌తో విద్యార్థుల్ని అప్రమత్తం చేశారు. నాయకుడు అన్న వాడు చేయాల్సిన పని ఇదీ. ఏపీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నేడు విద్యార్థులకు రియల్ హీరోలు. ఎందుకంటే పథకాలిస్తున్నాం అని చెప్పి తల్లిదండ్రులపై రుద్ది వారిని ఆత్మన్యూనతకు గురిచేయలేదు.. రాజకీయాలు మాట్లాడి పసి పిల్లల హృదయాల్లో మకిలిని నింపలేదు. సభలు, సమావేశాలలో ప్రసంగించే రాజకీయ నాయకుల్లా కాకుండా, క్లాస్ రూంలో విద్యా బుద్ధులను బోధించే గురువులుగా మాత్రమే ప్రవర్తించారు. తల్లిదండ్రులు, గురువులే విద్యార్థులకు రియల్ హీరోలన్న సందేశం ఇచ్చారు. మరి గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో పరిస్థితి ఎలా ఉందో కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ఈ మార్పును ప్రతి ఒక్కరూ గుర్తించి తీరాలి.
Also Read: MGM Warangal: చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి బతికే ఉన్నాడు! వరంగల్ ఎంజీఎంలో ట్విస్ట్
Chandram Mastaru: ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కానీ, విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ కానీ ఏనాడు చంద్రబాబు, లోకేష్‌ల మాదిరిగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లంటూ కండక్ట్ చేసి బడి గుమ్మం తొక్కింది లేదు. ఎంపిక చేసుకున్న విద్యార్థుల్నే తమ వద్దకు పిలిపించుకుని ఫొటోలు దిగి పంపించేవారు. ఇక అమ్మఒడి డబ్బులు వేసిన ప్రతి సారీ ఓ భారీ బహిరంగ సభ పెట్టి, విద్యార్థుల్ని పొలోమని బస్సులు, స్కూల్ వ్యాన్లలో పట్టుకువెళ్లేవారు. అభం శుభం తెలియని విద్యార్థులను ముందు కూర్చో బెట్టుకుని జగన్ రెడ్డి రాజకీయ ప్రసంగాలు దంచేవారు. జగన్ మామయ్యా.. అంటూ విద్యార్థులతో బలవంతంగా పిలిపించుకునే వారు.. వారితో పొగిడించుకుని మురిసిపోయేవారు. విద్యార్థులు, తల్లిదండ్రులున్న నిండు సభలో పెళ్లాలు, పెళ్లిళ్లు అంటూ మాట్లాడేవారు. దత్తపుత్రుడు, పప్పు, ముసలాయన అంటూ ప్రతిపక్ష నేతల్ని దూషించి పిల్లలతో చప్పట్లు కొట్టించుకునేవాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ విద్యార్థుల ముందే జుగుప్సాకరంగా మాట్లాడి.. పసి మనసుల్ని మలినం చేసే కార్యక్రమాలే నిత్యం పెట్టుకునే వాడు. పిల్లల స్కూలు బ్యాగు దగ్గర నుంచి, షూస్, బెల్టు, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు… ఆఖరికి తినే గుడ్డు, చిక్కీల మీద కూడా తన ఫొటోలు ముద్రించుకుని, పై నుంచి కింది దాకా పార్టీ రంగులు పులిమేసి.. తన రాజకీయ పార్టీకి ప్రచారం చేసి పెట్టే బొమ్మలుగా చిన్న పిల్లల్ని మార్చేశాడు జగన్ రెడ్డి.
ఎండ్ వాయిస్ – ఇప్పుడు కూటమి ప్రభుత్వ పుణ్యమా అని… ఆ మరకలేవీ బడులలో లేవు. స్వచ్ఛమైన హృదయాలతో ఉండే విద్యార్థులు… ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మవిశ్వాసంతో చదువుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే… ప్రభుత్వ పాఠశాలకు ఐదేళ్ల అవమానం, అడ్డుగోడల నుండి లభించిన స్వాతంత్ర్యం ఇది.

