CBN History Repeat: చల్లకు వచ్చి ముంత దాచినట్లు చంద్రబాబు అసలు విషయం దాచాడా? మోదీ-చంద్రబాబు భేటీ అసలు విషయం తెలిశాక ఆశ్చర్యపోయాయి జాతీయ, అంతర్జాతీయ మీడియా వర్గాలు. ప్రధాని మోదీని జీఎస్టీ ప్రచార సభకు ఆహ్వానించే నెపంతోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఇక్కడి మీడియా ప్రచారం చేసింది. నిజానికి “చల్లకు వచ్చి ముంత దాచినట్టు” ఉందన్నది జాతీయ, అంతర్జాతీయ మీడియా వర్గాల అసలు విశ్లేషణ. కర్నూలులో జరిగే సభ ఆహ్వానం కేవలం పైకి కనిపించే అంశం మాత్రమే అని… అక్టోబర్ 13న మోదీతో భేటీ, ఇవాళ్టి రోజు 15 బిలియన్ డాలర్ల విలువైన గూగుల్ AI డేటా సెంటర్ ఒప్పందంపై సంతకం చేయడమే ఈ పర్యటన వెనుక ఉన్న ‘అసలైన ఎజెండా’ అని జాతీయ మీడియా పత్రికలు కూడా కాస్త లేటుగా గ్రహించాయి. దేశ ఆర్థిక సంస్కరణల చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ FDIగా రికార్డు సృష్టించింది. ఈ డీల్‌ను ‘ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు కొత్త ఊపిరి’ పోసిన బలమైన ఆర్థిక ఆమోదంగా జాతీయ పత్రికలు కీర్తించాయి.
Also Read: Nitish Kumar: టికెట్ల రగడ.. సీఎం నితీష్ కుమార్ నివాసం వద్ద ఎమ్మెల్యే ధర్నా
గూగుల్‌తో ఒప్పందం విశాఖపట్నాన్ని భారతదేశపు మొట్టమొదటి ‘AI సిటీ’గా మార్చబోతోందనే అంశాన్ని ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ వంటి సంస్థలు నేడు ప్రముఖంగా ప్రచురించాయి. కేవలం పెట్టుబడి విలువనే కాక, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక విధాన మార్పును మీడియా హైలైట్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం, 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని, కేంద్ర ప్రభుత్వ నేషనల్ డేటా సెంటర్ పాలసీలో మార్పులను, కీలకమైన పన్ను మినహాయింపులను సాధించడం ఒక ‘కీలకమైన ఆర్థిక విధాన విజయం’. ఈ AI అస్త్రం ద్వారా రాష్ట్ర GSDPకి ఏటా సగటున రూ.10,518 కోట్ల సహకారం, అలాగే 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయనే లెక్కలు రాష్ట్ర పురోగతికి సంకేతంగా మారాయి.
మరోవైపు, అంతర్జాతీయ మీడియా ఈ పెట్టుబడిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానిక పెట్టుబడుల కోసం అభ్యర్థించిన ‘హోమ్ కాల్’ను గూగుల్ పట్టించుకోలేదు అన్న కోణంలో విశ్లేషించింది. రాయిటర్స్ మరియు గ్లోబల్ బిజినెస్ పత్రికలు, “ట్రంప్ స్వదేశీ పిలుపును దాటి, ఆసియాలో వేగవంతమైన వృద్ధి మార్కెట్ల వైపు గూగుల్ మొగ్గు చూపడం”గా ఈ నిర్ణయాన్ని పేర్కొన్నాయి. అమెరికా-చైనా సాంకేతిక పోటీ నేపథ్యంలో, గూగుల్ తన గ్లోబల్ సప్లై చైన్‌ను విస్తరించడంలో, భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా బలోపేతం చేయడంలో ఈ డీల్‌కు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ విశ్లేషణలు నొక్కి చెప్పాయి. మొత్తంగా, ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కు ఒక చారిత్రక ఘట్టంగా, భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారే దిశలో ఒక నిర్ణయాత్మక ముందడుగుగా మీడియా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.