BRS Silver Jubilee

BRS Silver Jubilee: కేసీఆర్‌ ‘రజతోత్సవ’ ప్లాన్‌ చూస్తే మతి పోవాల్సిందే!

BRS Silver Jubilee: బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్షలాది మందితో జరిగే ఈ భారీ బహిరంగ సభ కోసం గులాబీ నేతలు విభిన్న పనుల్లో నిమగ్నమయ్యారు. సభా ఏర్పాట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల సమీకరణ, అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు, నిధుల సేకరణ, మండే ఎండల దృష్ట్యా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల పంపిణీ.. ఇలా అన్నీ చకచకా జరుగుతున్నాయి. ఈ సభను గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. దీన్ని విజయవంతం చేసి, ప్రజల్లో సానుకూల వాతావరణం సృష్టించాలని నేతలు భావిస్తున్నారు. అధినేత కేసీఆర్ ప్రసంగం కేడర్‌లో జోష్ నింపుతుందని కూడా అంటున్నారు.

27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో సమావేశమై, సలహాలు, సూచనలు ఇచ్చారు. సభ లక్ష్యం, ప్రజల రాక కోసం అవసరమైన ఏర్పాట్లు, రవాణా వాహనాల బుకింగ్‌పై ఆదేశాలు జారీ చేశారు. 3000 ఆర్టీసీ వాహనాల కోసం 8 కోట్ల రూపాయల చెక్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు అందించారు. 27న ఉదయం ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించాలని, ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులను సమీకరించాలని నేతలకు సూచించారు.

BRS Silver Jubilee: ఇప్పటి వరకూ వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలన్నీ విజయవంతమవడంతో అది పార్టీకి సెంటిమెంట్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్‌లో సభ జరపలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షల్లో… వరంగల్‌లో బహిరంగ సభ జరపకపోవడమే ఓటమికి కారణమైందని కొందరు సెంటిమెంట్‌ను ముందుకు తెచ్చారు. సభ జరిగి ఉంటే అనుకూల వాతావరణం ఏర్పడేదని అభిప్రాయపడ్డారు. ఈ సెంటిమెంట్‌ను అనుసరిస్తూ, రజతోత్సవ సభకు ఓరుగల్లు గడ్డను వేదికగా నిర్ణయించారు కేసీఆర్‌.

Also Read: Kavitha: ‘జనసేన’ పుట్టలో వేలు పెట్టిన కవిత

ఇక ఆసక్తి రేకెత్తిస్తున్న మరో అంశం కేసీఆర్ ప్రసంగం. 25 ఏళ్ల పార్టీ ప్రస్తానంపై, మరోసారి అధికారం చేజిక్కించుకునే లక్ష్యంపై కేసీఆర్‌ ఎలాంటి అంశాలను లేవనెత్తుతారు.. కాంగ్రెస్‌, బీజేపీలపై ఎలాంటి వాగ్బాణాలను సందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలు తీరుపై ప్రసంగం సాగనుందని, పార్టీ కార్యాచరణను ప్రజలకు వివరిస్తారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై ఎందుకు మాట్లాడలేదో, రాష్ట్రంలో, కేంద్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పనున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయ్‌.

BRS Silver Jubilee: వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి అత్యధికంగా జనసమీకరణ జరపాలని కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఉమ్మడి వరంగల్ చుట్టూ ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ మందిని తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించారు. సిద్దిపేట, గజ్వేల్, ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, పాలేరు, ఖమ్మం, ఇల్లందు, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, చొప్పదండి, కరీంనగర్‌తో సహా మొత్తం 25 నియోజకవర్గాల నుంచి… 15 వేల నుంచి 20 వేల మంది చొప్పున, మిగిలిన నియోజకవర్గాల నుంచి 3 వేల నుంచి 5 వేల మంది చొప్పున జన సమీకరణ చేయాలని ప్లాన్ చేశారు. ఎండా కాలమైనా జనసమీకరణలో తేడా రావొద్దని, రిస్క్ ఉన్నా లక్ష్యం సాధించాలని నేతలకు సూచించారు కేసీఆర్‌.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *