BR Naidu: టీటీడీ ప్రక్షాళణలో భాగంగా చైర్మన్ బీఆర్ నాయుడు చేపడుతున్న కీలక ప్రతిపాదనలకు సీఎం నుండి వెనువెంటనే అనుమతులు అందుతున్నాయి. తాజాగా తిరుపతి అలిపిరి ప్రాంతం వద్ద దేవలోక్, ఓబెరాయ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్‌కే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి కేటాయించిన 35.32 ఎకరాల భూమి లీజును రద్దు చేస్తు నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అలిపిరి వద్ద ఒబెరాయ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి కేటాయించిన స్థలంలో ముంతాజ్ హోటల్ నిర్మించాలన్న నిర్ణయంతో.. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
దీంతో ఆ భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. దాంతో పాటు దేవలోక్ సంస్థకు కేటాయించిన 10.32 ఎకరాల భూమిని, అదేవిధంగా ఎంఆర్‌కే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు సంచల నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 35.32 ఎకరాల భూమిని.. తిరిగి టీటీడీకి అప్పగిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
BR Naidu: టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా బీర్ నాయుడు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం నిర్వహించిన మొదటి పాలకమండలి సమావేశంలోనే.. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్తులను టీటీడీ నుండి సగౌరవంగా పంపిస్తామని.. వారు కోరుకుంటే ప్రభుత్వ శాఖల్లో తత్సమానమైన పోస్టులు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. త్వరలోనే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్తుల విషయంలో చర్చలు జరిపి, వారిని ప్రభుత్వ శాఖల్లోకి తీసుకునే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించారు.
Also Read: CM Chandrababu: బెట్టింగ్ యాప్ లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో.. మెనూలో కొత్తగా వడలను భక్తులకు వడ్డించే విధంగా నిర్ణయం తీసుకొని.. అమలు చేశారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ లాగే త్వరలోనే శ్రీనివాస ట్రాస్ట్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన నిధులతో దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని సీఎం తాజాగా స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని చైర్మన్‌గా బీఆర్ నాయుడు పాలకమండలి సమావేశంలో ప్రతిపాదించగా… సీఎం చంద్రబాబు ఆమోదించారు.
BR Naidu: కొద్ది నెలలుగా నానుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల వివాదానికి చెక్ పెట్టింది టీటీడీ. మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటి రోజే సుమారు 600 మంది తెలంగాణ భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకున్నట్లు చైర్మన్ నాయుడు వెల్లడించారు. ఇక 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను రూ.5258.68 కోట్లతో ప్రవేశ పెట్టింది టీటీడీ. పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా రూ.43 వేలు జీతం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. పాత ఆగమ సలహా మండలి రద్దు చేసి, త్వరలోనే నూతన కమిటీని నియమిస్తామని స్పష్టం చేశారు. గూగుల్ సంస్థ ద్వారా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను సైతం వినియోగించుకుంటూ టెక్నాలజీ వాడకంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది టీటీడీ.

