Bonda Big Mistake

Bonda Big Mistake: పులి పరధ్యానంగా ఉందని పరాచకాలు ఆడకూడదు సు(ఉ)మా!

Bonda Big Mistake: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ని టచ్‌ చేసి బొండా ఉమా తప్పు చేశారా? సభలో పవన్‌ కళ్యాణ్‌ పేరెత్తితే హైలెట్ అవుతుందని, తను నెరవేర్చుకోవాలనుకున్న పని సులువుగా అవుతుందని భావించారా? అక్కడే స్ట్రాటజికల్‌ మిస్టేక్‌ జరిగిపోయిందా? అప్పటికే ఆ అంశంపై పవన్‌ పూర్తి స్టడీ చేసి ఉండటం, బొండా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడంతో.. బొండా చిక్కుల్లో పడబోతున్నారా? కూటమిగా జనసేనతో పొత్తులో ఉంటూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేయాల్సిన పనేనా అది? పవన్‌ కళ్యాణ్‌ పని చేసే ఉప ముఖ్యమంత్రి. ఐదు కీలక శాఖల బాధ్యతలు మోస్తున్న వ్యక్తి. తనకు వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా, ఒక వైపు పెండింగ్‌ సినిమాలు కంప్లీట్‌ చేయాల్సి ఉన్నా, తన పనులన్నీ పక్కన పెట్టి, తన నిర్మాతలు నష్టపోతారని తెలిసీ, రూ.కోట్లలో ఉండే తన రెమ్యునరేషన్‌ కూడా వదులుకుని… 5 మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌. ప్రజల కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో గత 16 నెలలుగా తన పార్టీ అభివృద్ధిని కూడా పట్టించుకోవడం మానేశారు. మరి పనిచేసే నాయకుడి మీద తమ స్వార్థానికి నిందలు వేయడం భావ్యమేనా? పొత్తులో ఉన్నప్పుడు తల్లి, బిడ్డ న్యాయం అమలు చేయాలని బలంగా నమ్మే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. అందుకోసం 99 సార్లు తనే తగ్గి వెళ్తారు. కానీ ఆయన సహనానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా. పవన్‌ కళ్యాణ్‌ గురించి బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి లైన్‌ క్రాస్‌ చేసిన బొండా ఉమాపై చర్యలకు ఉపక్రమిస్తారా? అసలు బొండా టార్గెట్‌ ఎవరు? ఎవర్నో టార్గెట్‌ చేయబోయి మధ్యలో పవన్‌ని లాగారా? లోగుట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అసెంబ్లీలో కాలుష్య నియంత్రణ బోర్డు – పీసీబీ పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, పీసీబీ చైర్మన్ క్రిష్ణయ్యను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు కూటమిలో చర్చనీయాంశమయ్యాయి. బొండా ఉమా ఉద్దేశం ఏమిటి? పవన్ పేరు ప్రస్తావిస్తే తన నియోజకవర్గ సమస్యలు హైలైట్ అవుతాయని భావించారా? లేక, స్ట్రాటజిక్ మిస్టేక్‌తో చిక్కుల్లో పడ్డారా? విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయిన బొండా ఉమా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సన్నిహితుడు. తన నియోజకవర్గంలో క్రెబ్స్ బయోకెమికల్స్ పరిశ్రమ వల్ల కాలుష్యం జరుగుతోందని ఫిబ్రవరిలో పీసీబీకి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. అయితే, పీసీబీ చర్యలకు సిద్ధమైనప్పుడు ఆయనే వాటిని ఆపమని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత అసెంబ్లీలో పీసీబీ చైర్మన్ క్రిష్ణయ్యను, పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ విమర్శించడం దుమారం రేపింది. పీసీబీ చైర్మన్ సరిగా పనిచేయడం లేదని, ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని బొండా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పవన్‌ను కాస్తంత ఆవేదనకు గురిచేశాయి. శుక్రవారం సభ ముగిసిన వెంటనే పీసీబీ అధికారులతో సమీక్షించిన పవన్‌.. బొండా వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని భావిస్తున్నారు. పీసీబీ చైర్మన్‌ క్రిష్ణయ్యతో మాట్లాడి, పూర్తి వివరాలతో నివేదిక తీసుకున్న పవన్‌… బొండా ఉమా ఉద్దేశాలను సీఎం చంద్రబాబుకు నివేదించాలని నిర్ణయించారు.

Also Read: Sridhar Babu: హెచ్-1బీ వీసా రుసుము పెంపుపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

అయితే బొండా ఉమా వ్యాఖ్యలు కూటమిలో చర్చనీయాంశమయ్యాయి. గతంలో కూడా ఆయన పవన్‌పై విమర్శలు చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉంటూ, పవన్‌ను టార్గెట్ చేయడం స్ట్రాటజిక్ మిస్టేక్‌గా జనసేన, టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఐదు మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సినిమా కమిట్‌మెంట్లను పక్కనపెట్టి, ప్రజల కోసం సమయం కేటాయిస్తున్నారు. గత 16 నెలలుగా తన పార్టీ అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు. అలాంటి నాయకుడిని విమర్శించడం బొండా స్వార్థపూరిత చర్యగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
అసలు క్రెబ్స్‌ పరిశ్రమ కాలుష్యంపై పీసీబీకి ఫిర్యాదు చేసింది ఆయనే. తీరా పీసీబీ చర్యలకు సిద్ధమైతే ఆపమని అడ్డుపడుతోంది ఆయనే. కింది స్థాయి అధికారులు చర్యలు ఆపడం తమ చేతిలో లేదని, నేరుగా పీసీబీనే సంప్రదించాలని తేల్చేయడంతో… బొండా పీసీబీ చైర్మన్‌ను టార్గెట్‌ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తను అనుకున్న పనిని నెరవేర్చుకునే క్రమంలో భాగంగా… వైసీపీ ఎంపీకి చెందిన రామ్‌కీ ఫార్మాని మధ్యలో తీసుకొచ్చి, ఏకంగా పవన్‌ కళ్యాణ్‌నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని పలువురు భావిస్తున్నారు.

చంద్రబాబుకు పవన్ సహనం గురించి బాగా తెలుసు. అలాగే పవన్‌ కోపం గురించి కూడా బాగా తెలుసు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ విషయంలో బొండా ఉమా లైన్ క్రాస్ చేశారన్న మాట రావడంతో, బొండాకు సీఎం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు పలువురు పరిశీలకులు. ఈ వివాదం బొండా ఉమాకు భవిష్యత్తులోనూ చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *