Bharat vs Pak War Alarm

Bharat vs Pak War Alarm: భారత ఆర్మీ సింహ గర్జన.. త్రివిధ దళాలు సంసిద్ధం!

Bharat vs Pak War Alarm: పవిత్ర భారత భూమిపై శాంతి కోసం పరితపించే సైనిక హృదయాలు, దేశ రక్షణ కోసం ఉరిమే ధైర్య శిఖరాలు, ప్రతీకార జ్వాలతో మండే యువ గుండెలు.. ఈ రోజు ఒక్కటై, పాకిస్తాన్‌ ముష్కరులకు చావు గంటలు మోగిస్తున్నాయి! భారత త్రివిధ దళాలు సమర శంఖం పూరించి, శత్రువు గుండెల్లో భీతి రగిల్చే సమరోత్సాహంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆ కీలక సందేశం ప్రతి భారతీయుడి రక్తంలో దేశభక్తి జ్వాలలను రగిలిస్తోంది. “దేనికీ భయపడం, ఏ భూభాగం మాకు క్లిష్టమైనది కాదు, ఎప్పుడూ సిద్ధమే!” ఈ గర్జన విని, సరిహద్దులో నిలిచిన మన జవాన్ల ఛాతీలు గర్వంతో విరుచుకుంటున్నాయి.

పాకిస్తాన్‌ ముష్కరుల గడ్డ.. తన పిరికి గుండెను మరోసారి బయటపెట్టుకుంది. పెహల్గావ్‌ ఉగ్రదాడి తర్వాత, పాక్‌ పెంపుడు కుక్క “ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌” సంస్థ దాడి చేసింది మేమే అని ప్రకటించుకుంది. దాడికి పాల్పడుతూ మన పర్యాటకులతో “మోడీ కో బోలో” అంటూ పిచ్చి వాగుడు వాగారు. కానీ, భారత సైన్యం యుద్ధ సన్నాహాల గర్జన వినగానే, ఆ మదమెక్కిన మూకలు తోక ముడిచి, “మాకు సంబంధం లేదు” అంటూ ప్రాణ భయంతో పారిపోతున్నాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వం కూడా గుంట నక్కలా మాట్లాడుతూ, “విచారణ జరుపుదాం” అంటూ కాగితపు పులిలా మాటలు చెబుతోంది. కానీ, పాక్‌ నక్క జిత్తులు భారత్‌కు తెలియనివి కావు! అందుకే మన సైనికులు సరిహద్దులో కేవలం ఆయుధాలతో మాత్రమే కాదు, దేశభక్తి జ్వాలలతో, అమర జవాన్ల త్యాగాల స్ఫూర్తితో సన్నద్ధమవుతున్నారు.

Also Read: Pakistani Tourists: ఇక పాకిస్తానీలు తాజ్ మహల్ చూడటానికి రాకూడదు..

Bharat vs Pak War Alarm: యుద్ధం అంటూ జరిగితే.. హిమాలయాల హిమగిరుల్లో అయినా, రాజస్థాన్‌ ఎడారుల్లో అయినా, అరేబియా సముద్ర తీరంలోనైనా… మన త్రివిధ దళాల ప్రతి అడుగూ శత్రువుకు భీకరమైన సవాలే. మన నావీ యుద్ధనౌకలు సముద్రంలో సింహ గర్జనలు చేస్తే.. వైమానిక దళం ఆకాశంలో గరుడ రెక్కలు విప్పితే.. ఇండియన్ ఆర్మీ జవాన్లు హిమగిరుల్లో కదం తొక్కితే.. పాక్‌ సైన్యాలు తుత్తునియలు అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు. పాకిస్తాన్‌ తన ఉగ్రవాద చర్యలతో భారత్‌ను బెదిరించాలనుకుంటే, వారికి గుర్తుండిపోయే చావు దెబ్బ తప్పదు! 1971లో ఢాకా ముందు మోకరిల్లిన పాక్‌ సైన్యం, బాలాకోట్‌లో బొక్కలు తిన్న ఉగ్ర శిబిరాలు, ఇవన్నీ భారత్‌ సత్తాకు చిహ్నాలు. ఇప్పుడు మరోసారి, మన సైన్యం సరిహద్దులో శత్రువును చీల్చిచెండాడేందుకు సిద్ధంగా ఉంది. భారత గర్జన ముందు పాక్‌ గుంటనక్కలా తోకముడుచుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. అందుకే రెండే రోజుల్లో పాక్‌ స్వరంలో ఈ మార్పు.

ALSO READ  Lung Health: మీ ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలంటే..ఈ పండ్ల తప్పక తినాలి

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *