Bandi Sanjay

Bandi Sanjay: కట్టర్‌ సమూహమే కాదు, బడి పిల్లలూ ఆయన సైన్యమే!

Bandi Sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పేదరికం నుండి పైకొచ్చిన వ్యక్తి. ఆయన రాజకీయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఫైర్‌ బ్రాండ్‌ రాజకీయాలకు పెట్టింది పేరైన బండి సంజయ్‌కి కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకూ అందరూ అభిమానులే. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బండి సంజయ్‌ది సినిమా హీరోలకు మించిన క్రేజ్‌. కష్టపడి తనని తాను నిరూపించుకుని, అధిష్టానాన్ని మెప్పించి, తన ప్రతిభ, శక్తి సామర్థ్యాలతో ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా పైకొచ్చిన వ్యక్తి. ఒక రాష్ట్రానికి ఒక జాతీయపార్టీ అధ్యక్షుడు కాగలిగాడంటే… ప్రజల్లో ఆయన సంపాదించుకున్న ఆదరాభిమానాలు, ప్రేమ, నమ్మకమే కారణాలు. అవినీతి అనే మాటే బండి కాంపౌండ్‌లో వినబడదు అంటారు. కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లి పోరాడగలిగే నాయకుడు కాబట్టే.. ఆయన మీద ఈగ వాల కుండా కాపాడుకుంటారు ఆయన అభిమానులు. అటు వంటి వ్యక్తి ఇవాళ తలపెట్టిన ఓ మంచి కార్యక్రమం తెలంగాణలో చర్చనీయాంశం అయ్యింది.

కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం ఒక్కసారిగా సందడితో నిండిపోయింది. వేలాది మంది విద్యార్థులు, కొత్త సైకిళ్లు, జై సంజయన్న అన్న నినాదాలు, తల్లిదండ్రుల ఆనందం… ఇవన్నీ కలిసి ఒక అద్భుత వాతావరణాన్ని సృష్టించాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందాయి. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులకు సైకిండ్ల పంపిణీ మాత్రమే కాదని, పేదరికం నుంచి పైకొచ్చిన, నిజాయితీ, సేవాథృక్పతమున్న ఓ నాయకుడి నుండి భావి పౌరులైన పిల్లలు స్ఫూర్తి పొందేందుకు ఓ మంచి అవకాశమని అభివర్ణిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.

Also Read: Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Bandi Sanjay: బండి సంజయ్‌… కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో సినిమా హీరోలకు మించిన క్రేజ్‌ ఉన్న నాయకుడు. పేద కుటుంబం నుంచి వచ్చి, కష్టాలను అధిగమించి, కేంద్ర సహాయ మంత్రి స్థాయికి చేరిన ఆయన, తన గతాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. “నేనూ మీలాగే పేదరికంలో పెరిగాను. మా అమ్మానాన్న కష్టాలు పడి నన్ను చదివించారు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని, తల దించుకుని చదవండి. బాగా చదివితే, తల ఎత్తుకునే స్థాయికి వస్తారు,” అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఆయన మాటల్లో నిజాయితీ, ఆప్యాయత అందరి మనసుల్ని హత్తుకున్నాయి.

ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం బండి సంజయ్‌ నిజాయితీకి నిదర్శనంగా నిలిచింది. “ఇవి ప్రభుత్వ నిధులు కావు. నేను కోట్లు ఖర్చు చేసే సంపన్నుడినీ కాదు. కార్పొరేట్‌ సంస్థల సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ సైకిళ్లను కొన్నాం” అంటూ ఆయన బహిరంగంగా చెప్పారు. ఈ నిజాయితీ రాజకీయ నాయకులకు ఆదర్శం. 20 వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసి, దశలవారీగా పంపిణీ చేస్తున్న బండి సంజయ్‌, నెల రోజుల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. “ఈ సైకిళ్లు మోదీ గిఫ్ట్‌. అతి త్వరలో ‘మోదీ కిట్స్‌’ కూడా అందిస్తాం” అని హామీ ఇచ్చారు బండి సంజయ్‌. విద్యార్థులు కొత్త సైకిళ్లపై రయ్‌ రయ్‌మని ర్యాలీ చేస్తూ ‘జై బండి సంజయన్న’ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *