Babu Singapore Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన గేమ్-ఛేంజర్‌గా నిలిచింది. గురువారంతో ఈ పర్యటన ముగియగా, ఆయన చేసిన సంచలన ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదటి రోజు నుంచే పెట్టుబడులు, పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్‌షిప్ మోడల్‌పై ఫోకస్ పెట్టారు. సింగపూర్‌లో నిర్వహించిన రోడ్‌షో ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా చేశారు. విద్యా సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు, మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ, ఏపీలోని అవకాశాలను, ప్రభుత్వ సహకారాన్ని వివరించారు. తన పర్యటనలో ప్రతి రోజు కూడా పెట్టుబడుల వేటలో బిజీగా గడిపారు సీఎం చంద్రబాబు. కేవలం రెండు-మూడు గంటల్లోనే ప్రముఖ వ్యాపారవేత్తలను పెట్టుబడులకు ఒప్పించడం.. పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు క్యాలిబర్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
భారత సంతతికి చెందిన, సింగపూర్‌లో స్థిరపడిన కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. అలాగే, మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమాసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల నాయకులతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ నుంచి సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలు చంద్రబాబు విజన్-2047ను మెచ్చుకుని, ఏపీలో తప్పకుండా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఒకే ఒక్క ప్రజెంటేషన్‌తో పెట్టుబడిదారులను ఆకర్షించిన చంద్రబాబు, వారి సానుకూల స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: Komatireddy Venkata Reddy: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు సింగపూర్ పర్యటన ద్వారా ఏపీ పెట్టుబడులు రానున్న రంగాలు ఒక సారి పరిశీలిస్తే… నూతన ఆవిష్కరణల కోసం ఐటీ పార్కులు, ఆధునిక కార్యాలయాలతో వర్క్ స్టేషన్లు, పర్యాటక, జీవవైవిధ్య రక్షణ కోసం వైల్డ్‌లైఫ్ పార్కులు, పర్యావరణ సహిత పర్యాటక అభివృద్ధికి ఎకో-టూరిజం, ప్రకృతి సంరక్షణ కేంద్రాలుగా బయోడైవర్సిటీ కాంప్లెక్స్‌లు, వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్లు, మౌలిక సదుపాయాలు, బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, గ్రీన్ ఎనర్జీ, ఫైనాన్స్ & ఇన్ఫ్రా లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ తదితర రంగాలున్నాయి. మొత్తానికి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఏపీకి ఓ సరికొత్త శకానికి నాంది పలికింది. ఆయన విజన్‌కు ప్రపంచ పెట్టుబడిదారులు ఫిదా అయ్యారు. ఈ టూర్ ఫలితాలు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తాయనడంలో సందేహం లేదు.