Babu offer Jagan Refusal

Babu offer Jagan Refusal: వైసీపీలో వన్‌ అండ్‌ ఓన్లీ.. జగన్‌ మోహన్‌ రెడ్డి!

Babu offer Jagan Refusal: జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తనకు పేపర్లు లేవు, టీవీలు లేవు.. అని స్వయంగా దండోరా వేసేవారు. ఆయనకు ఉన్నా సరే… లేనట్లుగానే ఆయన భావిస్తారు, మనమూ అదే భ్రమపడాలి అనమాట. తాజాగా అటువంటి లిస్టులో భారతి సిమెంట్ కూడా చేరిపోయింది. భారతి సిమెంట్‌.. తనది కాదట, తన భార్య భారతిది కూడా కాదట. మద్యం స్కాంలో సీఐడీ పోలీసులు… గోవిందప్ప బాలాజీ అనే ఆడిటర్‌ను అరెస్టు చేశారు. ఆయన భారతి సిమెంట్ ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి. విజయసాయిరెడ్డి తర్వాత అంతటి ఆస్థాన ఆడిట్‌ కోవిదుడు ఈ గోవిందప్ప బాలాజీనే. జగన్, భారతిల ఆర్థిక వ్యవహారాలు ఈయనే చూస్తారు. అతన్ని అరెస్టు చేశారు.

మద్యం స్కాంలో డబ్బులు.. వేరే కంపెనీల ద్వారా.. మనీలాండరింగ్ చేయించి.. భారతి సిమెంట్ లోకి ప్రవహించేలా చేశారని సీఐడీ అధికారులు గుర్తించారు. అందులో గోవిందప్ప పాత్ర కీలకమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు గోవిందప్పను ఆజ్ఞాతంలోకి పంపారు. అయితే గోవిందప్ప సీఐడీ అధికారులకు దొరికిపోయాడు. వెంటనే వైసీపీ మీడియా టోన్ మారిపోయింది. గోవిందప్ప బాలాజీ అరెస్టు అక్రమం అని వాదిస్తూనే, అసలు.. భారతి సిమెంట్.. జగన్ కుటుంబానిది కాదనే వాదన ప్రారంభించారు. ఎప్పుడో వికాట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి భారతి సిమెంట్స్‌ను అమ్మేశామని.. అది వారి కంపెనీనే అని చెప్పడం ప్రారంభించారు. దీంతో వైసీపీ నేతలకే మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

Also Read: Zakia Khanam joins BJP: వైసీపీకి బిగ్‌ షాక్‌! మరో ఎమ్మెల్సీ రాజీనామా..

Babu offer Jagan Refusal: అయితే ఇలాంటి చిత్ర విచిత్రమైన వాదనలు వైసీపీకి తొలిసారి కాదు. తన దాకా వస్తే.. సొంత తల్లీ, చెల్లిని కూడా చూడరు జగన్మోహన్‌ రెడ్డి. తన రాజకీయం, తన అధికారం, తన ఆస్తులు… ఇవే తనకు ప్రాధాన్యం అన్నట్లుగా ఉంటారు. ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా వైసీపీకి వ్యతిరేకంగా ఏ చర్య చేపట్టినా.. దాని వల్ల జగన్‌ సీటు కిందకు నీళ్లు వస్తాయని తెలిస్తే చాలు… దాన్ని టీడీపీతో లింకు పెట్టడం, వారందర్నీ టీడీపీ ఏజెంట్లుగా ముద్ర వేయడం వైసీపీకి పుట్టుకతో వచ్చిన అలవాటు. ఆ పార్టీకి సిద్ధాంతాలంటూ ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ.. ఉంటే మాత్రం ఆ సిద్ధాంతాలలో అత్యంత కీలకమైన అధికరణ ఇదేనని చెప్పొచ్చు. ఈ రూల్‌ నుండి ఎవరూ తప్పించుకోలేరు.

న్యాయమూర్తులైనా సరే, కులాన్ని బట్టి టీడీపీకి అంటగట్టేస్తుంటారు జగన్‌ మోహన్‌ రెడ్డి. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు వైసీపీ నుండి ఎదురైన అనుభవాలే ఇందుకు ఉదాహరణ. ఎన్వీ రమణ ఎక్కడ సుప్రీంకోర్టుకు సీజే అవుతారో అన్న భయం అప్పట్లో జగన్‌కు బాగా పట్టుకుంది. దీంతో ఆయనపై తన సొంత మీడియాలో కథనాలు వండి వార్చడం మొదలైంది. ఇందులో భాగంగానే… జస్టిస్‌ ఎన్వీ రమణ కుమార్తెలు అమరావతిలో విలువైన భూములను అక్రమంగా కొనుగోలు చేసేందుకు కుట్ర చేశారంటూ అప్పట్లో ఎన్వీ రమణపై ఎటాక్‌ మొదలు పెట్టింది వైసీపీ. అయితే ఎన్వీ రమణ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ అవ్వగానే.. సీఎంగా ఉన్న జగన్.. స్వయంగా సీజేఐ ఎన్వీ రమణ వద్దకు వెళ్లి క్షమాపణలు వేడుకున్నట్లు వార్తలొచ్చాయ్‌.

ఇక నవ్యాంధ్ర తొలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పనిచేస్తున్న సమయంలో ఆయనకూ కులాన్ని ఆపాదిస్తూ.. సీఎంగా ఉన్న జగన్‌ రెడ్డే స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి, తన కుల గులను బయటపెట్టుకున్నారు. ఇక చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్రావును అలాగే చూశారు జగన్‌మోహన్‌రెడ్డి. ఇది అధికారులకు, న్యాయమూర్తులకే పరిమితం కాలేదు. సొంత పార్టీలోని నేతల నుండి, సొంత ఇంట్లో తల్లీ చెల్లి వరకూ అందరి విషయంలో జగన్‌ చెప్పేది ఒక్కటే లాజిక్‌. తనకు ఎదురు తిరిగారో… వాళ్లు టీడీపీకి అమ్ముడు పోయినట్లే. జగన్‌ రెడ్డికి జైలు మేట్‌గానూ, పార్టీలోనూ ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి.. వైసీపీ నుండి బయటకొచ్చి, లిక్కర్‌ స్కామ్‌ గురించి మాట్లాడితే… విజయసాయిరెడ్డి టీడీపీకి అమ్ముడుపోయాడనీ, చంద్రబాబు మార్గదర్శకంలో పనిచేస్తున్నాడనీ రాసేశారు.

Also Read: Sabitha Indra Reddy: కాంగ్ర‌స్ ప్ర‌భుత్వం రాష్ట్ర ఆడ‌బిడ్డ‌ల ప‌రువు తీసింది: స‌బితా ఇంద్రారెడ్డి

Babu offer Jagan Refusal: ఇక ప్యాలెస్‌లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసి, లిక్కర్‌ దందాకి డాన్‌గా నియమించిన రాజ్‌ కసిరెడ్డిని కూడా.. తమ వాడు, మేమెప్పుడూ చూడలేదు అనేసింది వైసీపీ. రాజ్‌ కసిరెడ్డి పక్కా టీడీపీ వ్యక్తి అనేట్లు ప్రచారం మొదలెట్టింది. తన తండ్రి చావుకు న్యాయం చేయాలని వైఎస్‌ సునీత పోరాటం చేస్తే… టీడీపీతో చేతులు కలిపిందని అనేశారు. సునీత, ఆమె భర్తే హంతకులనీ నిందలేశారు. సునీత జగన్‌కు బాబాయ్‌ కూతురు. కానీ సొంత చల్లి షర్మిల విషయంలోనూ జగన్‌ అదే పని చేశారు. న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వమని అడిగినందుకు… చంద్రబాబు పంజరంలో చిక్కుకున్న చిలుకగా షర్మిలను వర్ణించింది వైసీపీ మీడియా. పసుపు చీర కట్టుకుని వెళ్లి.. చంద్రబాబును కలిసిందంటూ.. సొంత సోదరుడైన జగన్ రెడ్డే స్వయంగా‌… వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె కూడా టీడీపీకి అమ్ముడుపోయిందని అని తేల్చేశాడు. షర్మిలను సపోర్ట్‌ చేస్తున్నందుకు విజయమ్మ కూడా చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఏజెంటే అని వైసీపీ అనకపోయినా, వైసీపీ మీడియా రాయకపోయినా.. వారి ఉద్దేశం మాత్రం అదే అన్నది స్పష్టం. కాకపోతే… సొంత మీడియాలో బదులు సోషల్‌మీడియాలో రాయించారు. కాదు కాదు.. ‘లం’ బూతులు తిట్టించారు.

అధికారులు, న్యాయమూర్తులు, సొంత పార్టీ నాయకులు, బంధువులు, తల్లీ, చెల్లెళ్లు, జగన్‌కి నా అన్న వాళ్లు అందరూ… ఆయన దృష్టిలో చంద్రబాబుకు అమ్ముడుపోయేవారే. ప్రపంచం మొత్తం చంద్రబాబుతో చేతులు కలిపి, తనని ఒంటరిని చేసిందని జగనన్న ఫీలింగు. ఆయన అభిమానుల ఫీలింగు కూడా అదే. దీన్నిబట్టి చూస్తే…. వైఎస్సార్‌సీపీ పార్టీలోనే కాదు, జగన్‌ ఇంట్లో కూడా చంద్రబాబుకు ఎవరైనా లొంగని వాళ్లు, అమ్ముడుపోని వాళ్లు ఉన్నారంటే… అది వన్‌ అండ్‌ ఓన్లీ జగన్‌ రెడ్డే అంటున్నారు విశ్లేషకులు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *