Aruna Crime Files: అరుణ అండ్ గ్యాంగ్ రౌడీ షీటర్ శ్రీకాంత్‌తో కలిసి చేసిన నేరాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుంటే అవాక్కవ్వాల్సిన పరిస్థితి. దందాలు, కబ్జాలు, స్మగ్లింగ్, సెటిల్మెంట్లు, హనీ ట్రాప్ వ్యవహారాలే కాదు.. ఏకంగా హత్యలకు తెగబడింది ఈ బ్యాచ్. వైసీపీ హయాంలో ఉన్నది మన ప్రభుత్వమే అన్న భరోసా వీరికి లభించింది. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధుల అండతోనే వీరీ స్థాయికి ఎదిగారని అర్థమౌతోంది. 2024లోనూ వైసీపీ ప్రభుత్వం కొనసాగి ఉండి ఉంటే.. అరుణ అండ్ అరాచక గ్యాంగ్ ఏ స్థాయికి వెళ్లేదో ఊహకు కూడా అందడం లేదంటున్నారు పరిశీలకులు.
అరుణని అరెస్ట్ చేసి, ఆమె బెదిరింపులపై కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు కోవూరు పోలీసులు. బెదిరించడం, భయపెట్టడం, మాట వినకపోతే చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడం.. ఇది అరుణ స్టైల్. అదే తరహాలో బిల్డర్ మురళి కృష్ణ మోహన్‌ను బెదిరించింది అరుణ. ఫ్లాట్ అద్దెకిచ్చిన కర్మానికి చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు బిల్డర్ మురళి కృష్ణ మోహన్. ఫ్లాట్ తనకు నచ్చిందని, తన పేరున రాయకుంటే స్పాట్‌లో చంపేస్తానని ఆరేడుగురు రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి, కత్తి చూపించి మరీ బెదిరించిందట ఈ కిలాడీ లేడీ. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ బిల్డర్ అగ్రిమెంట్ కూడా రాయించాడట. ప్రస్తుతం అరుణ అరెస్ట్ అయ్యి, జైలు ఊచలు లెక్కబెడుతోంది ఈ కేసులోనే. ఇది మచ్చుకు ఒక్కటే అని తెలుస్తోంది. పోలీసులు తమపై ఉన్న ఒత్తిడితో అరుణను కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆఘమేఘాల మీద అరెస్టు చేశారు కానీ, ఆమె నేరాల చిట్టా ఇంకా బయటకు రావాల్సి ఉందని సమాచారం.
Also Read: China: ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు.. భారత్ కు సపోర్ట్ గా చైనా
అరుణ తన దందాలకు వెపన్‌గా ఉపయోగించుకుంది రౌడీ షీటర్ శ్రీకాంత్‌ని. శ్రీకాంత్ నెట్వర్క్ కూడా మామూలుగా లేదని ఇప్పుడిప్పుడే వివరాలు వెలుగు చూస్తున్నాయి. కరుడుగట్టిన రౌడీలతో పెద్ద నేర సామ్రాజ్యాన్నే నెల్లూరులో నిర్మించుకున్నట్లు అర్థమౌతోంది. అరుణకు దందాలలో సహకరించింది కూడా శ్రీకాంత్ గ్యాంగ్‌కు చెందిన రౌడీలే. రజనీష్ అనే వ్యక్తిని బెదిరిస్తూ శ్రీకాంత్ అన్న ముని కృష్ణ మాట్లాడుతున్న ఆడియోలు బయటకు రాగా సంచలనం రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం రజనీష్ ప్రాణాలతో లేడు. శ్రీకాంత్ అన్న మునికృష్ణ ఎక్కడున్నాడో తెలియదు. తనని చంపేయబోతున్నారని తెలిసి, రజనీష్ చేసిన సెల్ఫీ వీడియోలతో శ్రీకాంత్ గ్యాంగ్ అరాచకాల గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మనుషుల్ని అతి తేలికగా చంపేసేవారని అర్థమౌతోంది. ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేయాలనుకున్న ఓ వ్యక్తికి.. ఆ పని చేసి పెట్టింది శ్రీకాంత్ గ్యాంగ్. నెల్లూరు జిల్లా మొత్తం విస్తరించిన శ్రీకాంత్ గ్యాంగ్‌కు వైసీపీ ప్రముఖులతో పరిచయాలున్నట్లు తెలుస్తోంది.
ఒక ప్లాన్ ప్రకారమే రౌడీ షీటర్, నెటోరియస్ క్రిమినల్ అయిన శ్రీకాంత్, అతడి గ్యాంగ్‌ని వలలో వేసుకుని తన దందాలకు అరుణ ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో కొనసాగి ఉండి ఉంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అరుణ ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో.. ఆ ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా సేఫ్‌గా ఉంది. లేదంటే నిజంగానే అరుణ.. ఓ లేడీ దావూద్‌లానో లేదంటే లేడీ నయీంలానో మారి ఉన్నా ఆశ్చర్యం లేదేమో.