Psr Manode Anna Jagan : ఏపీ రాజకీయ రణక్షేత్రంలో లిక్కర్ స్కామ్ ల్యాండ్ మైన్‌లా పేలింది! రాజ్ కసిరెడ్డి అరెస్ట్‌తో వైసీపీ గుండెల్లో గుబులు స్టార్ట్ అయ్యింది! సిట్ వలలో చిక్కిన కసిరెడ్డి, విజయసాయిరెడ్డి.. ఒకరి లెక్కలు మరొకరు బయటపెట్టుకుంటూ ఉంటే.. నెక్స్ట్ వికెట్ మిథున్ రెడ్డిదేనా అన్న చర్చ మొదలైంది. మంగళవారం పీఏసీ సమావేశంలో జగన్ స్వయంగా ఇదే సంకేతం ఇచ్చారట. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన మిథున్ రెడ్డి, నేను ఎంపీని… లిక్కర్ పాలసీతో నాకేం సంబంధం అంటూ కామన్ డైలాగ్‌తో సిట్‌కు చిర్రెత్తిస్తున్నాడు. కానీ, విజయసాయి రెడ్డి రివీల్ చేసిన లిక్కర్ పాలసీ సీక్రెట్స్ మిథున్‌ను కటకటాల్లోకి నెట్టేలానే కనబడుతున్నాయి.
ఇక, జత్వాని కేసులో సస్పెండైన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు… ఓసారి జైలుకెళ్లొస్తే సరిపోతుందిలే.. అనుకున్నా కాబట్టే బెయిల్‌కి అప్లై చేసుకోలేదని చెప్పి.. సిట్ అధికారులకే షాకిచ్చాడు. మరోవైపు.. అరెరె, ఇతడు నా కేసులో అరెస్టు అయ్యిుంటే బాగుండేదే అని ఫీల్ అయిపోతున్నారు రఘురామ. సస్పెన్షన్‌లో ఉన్న పీఎస్ఆర్, అప్పట్లో సీఎం చంద్రబాబు అనుగ్రహం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ చంద్రబాబు నా కాంపౌండ్‌లోకి కూడా అతన్ని రానియ్యొద్దంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చే సరికి.. తిరిగి జగన్ పంచన చేరి… కేసుల నుండి వైసీపీ నేతల్ని తప్పించేందుకు స్ట్రాటజిస్ట్‌గా మారాడని గుసగుసలు! రాజ్ కసిరెడ్డి అజ్ఞాతవాసానికి గైడెన్స్ ఇచ్చిన మాస్టర్‌మైండ్ కూడా పీఎస్సారే అన్న డౌటనుమానాలు సీఐడీ వ్యక్తం చేస్తోంది.
Psr Manode Anna Jagan: “ఒక్కసారి జైలుకెళ్తే సరి” అన్న పీఎస్ఆర్ డైలాగ్… వైసీపీ నేతల మానసిక పరిస్థితిని బట్టబయలు చేస్తోంది. ఇక పీఎస్‌ఆర్ అరెస్ట్ అనగానే.. జగన్ పీఏసీ మీటింగ్‌లో ఏడ్చేసినంత పని చేశారట. “వ్యవస్థలు దిగజారిపోయాయి” అంటూ పెడబొబ్బలు పెట్టిన జగన్, మిథున్ అరెస్ట్ ఖాయం అని కూడా అదే మీటింగ్‌లో తేల్చేశారట. జగన్ అక్రమాస్తుల కేసులో మళ్లీ ఈడీ జప్తులు.. వివేకా హత్య కేసు ప్రకంపనలు, ఇప్పుడీ లిక్కర్ కేసులో అరెస్టులు.. ఇవన్నీ జగన్‌నే చుట్టుముడుతున్నాయి! రాజ్ కసిరెడ్డి, పీఎస్ఆర్ అరెస్ట్‌లతో జస్ట్ సినిమా స్టార్ట్ అయింది అంతే. ఈ సినిమా ఆసాంతం క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ సీన్లు చాలానే ఉంటాయన్నది అనలిస్టుల అంచనా.