Annamayya Chief: అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోటా పోటీగా దాదాపు 24 మంది అధ్యక్ష పదవి కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పోటీ ఎంత తీవ్రంగా ఉందో. ఇప్పటికే త్రీమెన్ కమిటీ సీఎంకు నివేదిక అందజేసిందని వార్త లొస్తున్నాయ్. మరి షార్ట్ లిస్ట్‌లో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? ఇంతకూ పంతంలో నెగ్గేదెవరో, తగ్గేదెవరో ఇప్పుడు చూద్దాం.
అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న చమర్తి జగన్మోహన్ రాజుకు రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో జిల్లాకు కొత్త అధ్యక్షుడి నియామకం అవసరం ఏర్పడింది. దీంతో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల నుంచి ఎవరు అన్నమయ్య అధ్యక్షులు అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. అన్నమయ్య జిల్లాలో పార్టీ పటిష్టతను పెంచుతూ, కార్యకర్తలను కలుపుకుపోయే ఆ అధ్యక్షుడు ఎవరా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎంతమంది పోటీ పడినప్పటికీ ప్రధానంగా అధ్యక్షుని రేసులో ఉండేది సుగవాసి ప్రసాద్ బాబు, రైల్వే కోడూరు నుంచి కస్తూరి విశ్వనాథ నాయుడు, రాజంపేట నుంచి మేడా విజయశేఖర్ రెడ్డిలేనని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ మారి వైసీపీలోకి వెళ్లారు. ఆయన తమ్ముడు సుగవాసి ప్రసాద్ బాబు మాత్రం టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. దీంతో ప్రసాద్ బాబుకే జిల్లా అధ్యక్ష పీఠం దక్కుతుందా? అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే బలిజలకు ఉమ్మడి కడప జిల్లాలో అన్యాయం జరిగిందని బలిజ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. కడప, అన్నమయ్య జిల్లాలలో ఎక్కడో ఒక చోట బలిజ సామజిక వర్గం వైపు పార్టీ దృష్టి సారిస్తుందన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవి కోసం బలిజ సామాజికవర్గం నుండి సుగవాసి ప్రసాద్ బాబుతో పాటూ, బాలిశెట్టి హరిప్రసాద్ కూడా ట్రై చేస్తున్నారు.
Also Read: SriLakshmi Currupt: వైసీపీ క్యాడర్ అధికారి శ్రీలక్ష్మి లీలలు, అవినీతి చిట్టా..!!
ఇప్పటికే త్రిసభ్య కమిటీ అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి సీఎం చంద్రబాబుకు పంపినట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్న సందేహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పనిచేసే కార్యకర్తలకు పట్టం కడుతూ, పార్టీని ఏకతాటిపై నడిపే నాయకుడు రావాలని క్యాడర్ కోరుకుంటోంది. ఇక నిర్ణయం సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంది.