Ambati Fake Factory

Ambati Fake Factory: జగన్‌ దొంగ ఓట్ల ఆరోపణలు.. లెవెల్‌ చేసిన అంబటి!

Ambati Fake Factory: వైసీపీ ఎక్స్‌ మినిస్టర్‌ అంబటి రాంబాబు పొలిటికల్‌ ఫేక్‌ ఫ్యాక్టరీకి సరికొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారా? పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తాకిడితో ఆయన మళ్లీ సోషల్‌ మీడియా రింగ్‌లోకి దూకారు. అధికార పార్టీ రిగ్గింగ్‌ చేసిందంటూ ఓ వీడియో ట్వీట్‌ చేశారు. ఈ విజయం డీఐజీ కోయ ప్రవీణ్‌ ఐపీఎస్‌కు అంకితం అంటూ డ్రామా జోడించారు. కట్‌ చేస్తే… ఆ వీడియో? 2023 జులైలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల నాటిది! బ్యాలెట్‌ పేపర్‌ రంగులు కూడా మ్యాచ్‌ కాలేదు. అంబటి పోస్టు చేసిన వీడియో ఉన్నది పసుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌ కాగా.. ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో వాడింది పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్‌. దీంతో అంబటి అజ్ఞానాన్ని నెటిజన్లు ఒక్క క్షణంలో పసిగట్టారు. మొత్తానికి అంబటి… ఫేక్‌ ఫ్యాక్టరీలో ఈ వీడియో రీసైకిల్‌ చేసి, పులివెందులలో జరిగినట్లు నమ్మించాలనుకున్నారు. కానీ, దొరికిపోయారు!

ఇక అంబటి ఎంతటి గడుసరో చెప్పాలంటే.. ఆయన ఎక్స్‌లో పోస్టు చేసిన ఫేకు వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నా ఇంకా ఆ వీడియోను తన ఎక్స్‌ హ్యాండిల్‌ నుండి తొలగించకుండా అలాగే ఉంచారు. ఇప్పటికే అంబటి పోస్టు చేసిన వీడియోని రెండున్నర లక్షల మంది వీక్షించారు. అందులో అక్కడక్కడా కొందరు నిజమని కూడా నమ్మారు. అలా కొందరినైనా నమ్మించి, కూటమి పట్ల ద్వేషం పెంచగలిగితే తన పోస్టు సార్థకం అవుతుందని భావించినట్లున్నారు అంబటి. అయితే, అంబటి అత్యుత్సాహం వల్ల రెండ్రోజులుగా వైసీపీ చేస్తున్న రిగ్గింగ్‌, బూతు క్యాప్చరింగ్‌, దొంగ ఓట్ల ఆరోపణలన్నీ గాల్లో కలిసిపోయాయి.

Also Read: Pawan on vote chori: ఈవీఎంలపై ఏడుపుల వెనుక అసలు మ్యాటర్‌ !

అంబటి పోస్టు చేసిన వీడియోపై ఏపీ ఫాక్ట్‌ చెక్‌ టీం గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. అది పశ్చిమ బెంగాల్‌ వీడియో అని, అంబటిది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర అని ఎండగట్టింది. అంబటి ఫేకు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక నెటిజన్లు అయితే సెటైర్లతో అంబటిని చీల్చిచెండాడారు. “రాంబాబు గారూ, ఫేక్‌ వీడియోలు పోస్ట్‌ చేయడం కంటే గూగుల్‌ సెర్చ్‌ నేర్చుకోండి” అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. వైసీపీ అసలే డిప్రెషన్‌లో ఉండగా, అంబటి ఈ ఫేక్‌ స్టంట్‌తో పార్టీ పరువును గంగలో కలిపారు. జగన్‌ దగ్గర మార్కులు కొట్టేయాలని చేసిన ఈ స్టంట్‌, వైసీపీ క్యాడర్‌ను మరింత ఇబ్బందిలోకి నెట్టింది. అంబటి తెలివితేటలు చూస్తే, “ఫేక్‌ న్యూస్‌లో ఫస్ట్‌, రాజకీయాల్లో లాస్ట్‌” అని అనిపిస్తుంది. ఇలాంటి నాయకులతో వైసీపీ ఇంకెంత కాలం బండి లాక్కొని వస్తుందో చూడాలి మరి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *