Ambati Brothers: వైసీపీ నేతలు రాష్ట్రంలో రాజకీయ ఉనికిని నిలుపుకునేందుకు పోలీసులతో గొడవలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. నిన్నటి వైసీపీ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో అంబటి సోదరులు.. రాంబాబు, మురళి తమ ప్రవర్తనతో అందరి దృష్టిలో పడ్డారు. మంచా, చెడా.. రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉండటం ముఖ్యమన్న ఫార్ములాని ఈ సోదరులు బాగా వంట బట్టించుకున్నట్లున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పట్టాభిపురంలో వెన్నుపోటు దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నేతలను మందలు మందలుగా వెనకేసుకుని కలెక్టరేట్‌కు బయల్దేరారు. అయితే, ఆ రూట్‌లో ర్యాలీలకు ప్రవేశం లేదని, అయినా అంత మందిని కలెక్టరేట్‌లోకి అనుమతించలేమని స్థానిక సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాంబాబు అదే రూట్‌లో వెళ్తే ఏం చేస్తావంటూ సీఐపై రంకెలేయడం మొదలుపెట్టారు. పల్లు కరకరమంటూ కొరుతూ.. సీఐని ఉరిమి ఉరిమి చూశారు రాంబాబు. దీంతో సీఐ కూడా కంట్రోల్ తప్పి.. గట్టిగానే ఇచ్చేశారు అంబటి రాంబాబుకు.
వెన్నుపోటు దినం ఎఫెక్ట్‌తో ఇప్పుడు అంబటి రాంబాబుపై సెక్షన్ 353 కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వంలో ఇది రాంబాబుపై తొలి కేసు కావడం గమనార్హం. బుద్దిగా యూట్యూబ్ వీడియోలు చేసుకోక.. అంబటికి ఈ హీరోయిజం అవసరమా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు నెటిజన్లు. మరోవైపు, అంబటి సోదరుడు మురళి వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాట్లాడుతూ ఏకంగా ప్రజల్నే తిట్టిపోశారు. “జగన్‌మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురాని ప్రజలు గాలికి కొట్టుకుపోతారు” అంటూ శాపనార్థాలు పెట్టారు. ప్రజల్ని నిందించేందుకే వైసీపీ వెన్నుపోటు దినం జరిపింది అనడానికి అంబటి మురళి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయంటున్నారు టీడీపీ శ్రేణులు. ఏదైతేనేం పోలీసులకు బెదిరింపులు, ప్రజలకు శాపనార్థాలతో వార్తల్లో నిలిచారు అంబటి సోదరులు. అధికారంలో లేకున్నా లా అండ్ ఆర్డర్ మా చేతుల్లో ఉండాలనే విధంగా వీరి తీరు ఉందంటున్నారు అనలిస్టులు.
Also Read: Kodumur Tammullu: కొరకరాని కొయ్యగా ‘కోడుమూరు’ తయారైందా?
Ambati Brothers: వైసీపీ నేతలు పోలీసులతో తలపడటం, ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల విడదల రజినీ తన పీఆర్వో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారు డోర్‌కు అడ్డంగా నిల్చొని పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. ఇలాంటి చర్యలు వైసీపీ నేతలు కవరేజీ కోసమే రెచ్చిపోతున్నారనే విమర్శలకు దారితీస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కూడా ఈ తరహా వివాదాలకు దూరంగా లేరు. ఆయన ఎప్పుడు బయటకొచ్చి ప్రెస్మీట్ పెట్టినా.. పోలీసుల గుడ్డలు ఊడదీస్తానని చెబుతున్నారు. తెనాలిలో కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులో నిందితులను పరామర్శించేందుకు వెళ్లి, నేరస్తులకు మద్దతు పలికారు. ఈ చర్య ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసనలకు కారణమైంది. అయినా, సోషల్ మీడియా ఎలివేషన్స్‌తో జగన్ సంతృప్తి చెందినట్లు కనిపిస్తున్నారు.
వైసీపీ నేతలు రోడ్లపై రెచ్చిపోయి కేసులు కొని తెచ్చుకుంటుంటే, జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్‌లో సేదతీరుతూ కార్యకర్తలను పోరాటాలకు పురిగొల్పుతున్నారు. దీంతో నేతలు అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్తున్నారు లేదా జైలు పాలవుతున్నారు. నిన్నటి వెన్నుపోటు దినంలోనూ ఇదే జరిగిందని స్పష్టమౌతోంది.

