Bachelor Prema Kathalu

Bachelor Prema Kathalu: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

Bachelor Prema Kathalu: యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను తీసిన “కాలం రాసిన కథలు” సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్ గా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను” ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను.అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని 2025 లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

నటి గీతా సింగ్ మాట్లాడుతూ..అడియన్స్ అందరూ నా పాత్రకు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేయబోతున్నాను. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సాగర్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.

నటుడు కార్తీక్ మాట్లాడుతూ.. యూత్ మెచ్చే మంచి మెసేజ్ ఉన్న ఇలాంటి సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్న సాగర్ గారికి నా ధన్యవాదాలు.

నటుడు కాశీ మదన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు బ్యాచులర్స్ పై వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో వస్తున్న “బ్యాచిలర్స్ ప్రేమకథలు” సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డి ఓ పి. ప్రసాద్ ఎస్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు యూత్ ని ఆకట్టుకుంటాయి. అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.Bachelor Prema Kathalu

నటి ఇషాని మాట్లాడుతూ.. బెంగళూరులో మోడలింగ్ చేస్తూ సినిమాలో నటించాలని హంటింగ్ చేస్తున్న నాకు యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న “బ్యాచిలర్స్ ప్రేమ కథలు” సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత సాగర్ గారికి నా ధన్యవాదాలు.

నటి శృతి లయ మాట్లాడుతూ.. ఈ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ALSO READ  NTR New Movie: ఎన్టీఆర్ సినిమా విషయంలో KGF స్ట్రాటజీని ఫాలో అవుతున్న నీల్!

నటి చలానా అగ్నిహోత్రి మాట్లాడుతూ.. బ్యాచిలర్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఇలాంటి మంచి మూవీలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు

నటీ నటులు
గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : SM4 Films
టైటిల్ : బ్యాచిలర్స్ ప్రేమ కథలు
ప్రొడ్యూసర్- రైటర్- డైరెక్టర్ :
ఎమ్ ఎన్ వి సాగర్
డి ఓ పి : ప్రసాద్ ఎస్
మ్యూజిక్ : మెరుగు అరమాన్
ఎడిటర్ : నందమూరి హరి
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *