Baby Hindi Remake: తెలుగులో సంచలనం సృష్టించిన “బేబీ” సినిమా హిందీ రీమేక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా 2026 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం తెలిపింది. యువత ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కొన్ని విమర్శలను ఎదుర్కొంది. ఈ లోపాలను సరిదిద్ది, హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్లు దర్శకుడు సాయి రాజేష్ వెల్లడించారు.
Also Read: Sukumar: ‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ.. అభిమానుల్లో సంబరాలు
దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, మిగతా పనులన్నీ పూర్తి చేసి 2026 మొదటి ఆరు నెలల్లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్‌లో నటించే నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తెలుగులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రీమేక్ కూడా హిందీలో పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. మరి ఈ సినిమా ఎలా మెప్పించబోతుందో చూడాలి.