Lucknow Airport: ఓ పార్సెల్..ఓపెన్ చేయాలి అని అక్కడ ఉన్న అధికారులకు అనిపించింది. మొదట ఎదో పార్సెల్ ఏ కదా అని లైట్ తీసుకున్నారు. కానీ..లోపల ఎదో కొట్టింది. ఒకసారికి ఓపెన్ చేసే చుస్తే ఓ పనైపోతుంది అనుకుని..మొత్తానికి పార్సెల్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది. ఆ పార్సెల్ లోపల ఏముంది ? గుండె నిబ్బరం చేసుకోండి ..చూసి
Lucknow Airport: ఎయిర్ పోర్ట్ లగేజీ చెక్ చేస్తున్న సిబ్బంది దగ్గరకు ఓ చెక్కపెట్ట బాక్స్ వచ్చింది. అది స్కాన్ చేస్తే అక్కడున్నవారందరూ షాక్ అయ్యారు. లగేజీ చెకింగ్ సిబ్బంది బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో నెల రోజుల నవజాత శిశువు మృతదేహం ఉంది. పిల్లాడి మృతదేహాన్ని కెమికల్స్ మధ్య స్టోర్ చేశారు. ఓ ప్లాస్టిక్ డబ్బాలో ప్యాక్ చేసిన పార్సల్.. బ్లూ డార్ట్ కొరియర్ ఏజెన్సీ దాన్ని డెలివరీ చేస్తోంది. ఆ కొరియర్ బాక్స్ ను పట్టుకొని ఓ ఏజెంట్ కూడా వచ్చాడు. సరిగ్గా ముక్కుపచ్చలారని పిల్లాడిని బాక్స్ లో పెట్టి పార్సల్ చూయండి చూసి డ్యూటీలో ఉన్న సిబ్బంది భయాంధోళనకు గురైయ్యారు. ఈ అమానుష్య ఘటన లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో డిసెంబర్ 3న జరిగింది.
Lucknow Airport: వెంటనే అక్కడున్న ఎయిర్ పోర్టు ఇబ్బంది సీఐఎస్ఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే.. ఆ కొరియర్ తీసుకొచ్చిన వ్యక్తికి కూడా అందులో ఏం ఉందో తెలియదు. పోలీసులు కొరియర్ తీసుకోవడానికి వచ్చిన యువకుడిని, కొరియర్ సంస్థ ఏజెంట్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. లక్నోకు చెందిన ఓ జంట ఐవీఎఫ్ సెంటర్ నుంచి ముంబైకి బాలుడి మృతదేహాన్ని బ్లూ డార్ట్ కొరియర్ ద్వారా పంపుతున్నారు. అది రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉండే.. కానీ పొరపాటున ఫ్లైట్ డెలవరీకి వచ్చిందని కొరియర్ సంస్థ తెలిపింది. అనంతరం శిశువు మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం నవీ ముంబైకి పంపించారు పోలీసులు.
बेरहम और बुझदिल दुनिया की सच्चाई देखिए…
कोरियर में भरकर नवजात बच्चे का शव भेज रहे थे, लखनऊ एयरपोर्ट पर स्कैनिंग के दौरान पकड़ा गया
एजेंट के सामान में मिली बॉडी; मुंबई भेजा जा रहा थाhttps://t.co/0RdXFtsjXz pic.twitter.com/GK4vVx5qgc
— Gaurav Pandey (@gaurav5pandey) December 3, 2024