Azharuddin:

Azharuddin: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ కాంగ్రెస్ టికెట్ నాదే: అజారుద్దీన్‌

Azharuddin:జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ నాదే.. వేరే అభ్యర్థికి పార్టీ టికెట్ ఇస్తుంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి.. అవ‌న్నీ నిజం కాదు.. టికెట్ నాకే త‌ప్ప‌క వ‌స్తుంది.. పార్టీ కోసం నేను చాలాకాలంగా క‌ష్ట‌ప‌డుతున్నా.. అధిష్ఠానం నాకే టికెట్ ఇస్తుంది.. అని కాంగ్రెస్ పార్టీ నేత, క్రికెట‌ర్‌ అజారుద్దీన్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టే తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న పైవిష‌యాల‌ను పంచుకున్నారు.

Azharuddin:హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవ‌లే అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానంపై కాంగ్రెస్ నేత‌లు క‌న్నేశారు. ఇప్ప‌టికే ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఓడిన అభ్య‌ర్థిగా త‌న‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంద‌ని అజారుద్దీన్ ధీమాతో ఉన్నారు.

Azharuddin:కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడిగా ఇటీవ‌లే ఎన్నికైన అజారుద్దీన్ బంజారాహిల్స్‌లోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేశాన‌ని, చివ‌రి క్ష‌ణంలో పార్టీ టికెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆఖ‌రు వ‌ర‌కూ పోరాడాన‌ని తెలిపారు. త‌క్కువ ఓట్ల‌తోనే ఓట‌మి పాల‌య్యాయ‌న‌ని చెప్పారు. ఆ త‌ర్వాత జ‌రిగిన సికింద్రాబాద్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప‌రిధి నుంచే అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయ‌ని గుర్తుచేశారు.

Azharuddin:జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం దిశ‌గా చాలాకాలంగా ప‌నిచేస్తున్నాన‌ని అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికీ ప‌లుమార్లు బూత్‌స్థాయిలో, డివిజ‌న్ స్థాయిలో స‌మావేశాలు నిర్వ‌హించామ‌ని, పార్టీ చాలా బ‌లంగా ఉన్న‌ద‌ని, ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తంచేశారు. కొంత‌మంది పార్టీ వ్య‌క్తులు కావాల‌నే సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్త‌లు రాయిస్తున్నార‌ని తెలిపారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌డం లేదంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆ విష‌యాల‌ను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాన‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *