Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో జరిగిన ‘ల్యాంప్ లైటింగ్ సెర్మనీ’లో పాల్గొని విద్యపై తన భావాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మదర్ నర్సింగ్ విద్యాసంస్థ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చదువు అంటే నాకు ఎప్పటి నుంచో ఆసక్తి. అయితే ఇంటర్ పూర్తయ్యాక ఎక్కడ డిగ్రీ చదవాలో తెలియక తడబడిపోయాను. నర్సీపట్నంలో అప్పట్లో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో కాకినాడకు వెళ్లి చదవాల్సి వచ్చింది,” అని చెప్పారు.
తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక తనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వేసిన ప్రశ్నను గుర్తు చేసుకున్నారు. “ఏం కావాలి?” అని ఎన్టీఆర్ అడిగినప్పుడు, నేనూ చదువులో ఇబ్బంది పడ్డాను కాబట్టి, నా నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ కావాలని కోరాను,” అని పేర్కొన్నారు.
అప్పటినుంచి నర్సీపట్నాన్ని విద్యా కేంద్రముగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కృషి చేశానని తెలిపారు. “నర్సీపట్నంలో పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్, బీఈడీ వంటి విద్యాసంస్థలను స్థాపించగలిగాను. విద్యే సమాజాన్ని మార్చగల శక్తి కాబట్టి, ప్రతి యువతకు విద్యావకాశాలు అందుబాటులో ఉండాలి,” అని స్పీకర్ చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకుఆయన శుభాకాంక్షలు తెలిపారు. నర్సింగ్ విద్యలో రాణించి సమాజానికి సేవ చేయాలన్నారు.