KL Rahu

KL Rahul: పాపం ఎప్పుడూ కె ఎల్ రాహుల్ కే అన్యాయం జరుగుతుందా?? గంభీర్ పై మండిపడ్డ సీనియర్ క్రికెటర్

KL Rahul: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్‌కు అన్యాయం జరుగుతోందని, అనవసరమైన ప్రయోగాలతో అతని ఆటను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ ఐదవ స్థానంలో ఆదినప్పుడు మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడని, కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతనిని ఆరో స్థానంలో ఆడించడం తప్పు అని వాదించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రాహుల్‌కు ప్రాధాన్యత ఇవ్వగా, రెండు వన్డేల్లోనూ అతనిని ఐదో స్థానం కాకుండా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు.

టీమిండియా ఇంగ్లాండ్ తో ఆడుతున్న సిరీస్ లో మొదటి రెండు వన్డేల్లో కీపర్ కేఎల్ రాహుల్ కు బదులుగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్‌ను ఐదో స్థానానికి ప్రమోట్ చేశారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్‌లో 9 బంతుల్లో 2 పరుగులే చేసిన రాహుల్, రెండవ వన్డేలో 14 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడించాలనుకున్నప్పుడు, అసలు రిషభ్ పంత్‌ నే తుది జట్టులోకి తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో క్రిష్ శ్రీకాంత్ మాట్లాడుతూ, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు మంచిదే కానీ కేఎల్ రాహుల్‌కు అన్యాయం చేస్తున్నారు అన్నాడు. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేసి బాగా ఆడుతున్నాడు. కానీ రాహుల్‌ను వేరుగా చూస్తున్న తీరు సరికాదని చెప్పాడు. అతని నెంబర్ 5 రికార్డులను పరిశీలించండి, అద్భుతమైన రికార్డ్ ఉంది. అతని బ్యాటింగ్ స్థానం గురించి మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. అతను 6, 7వ స్థానాల్లో ఆడితే ఇలాగే ఔటవుతాడు అన్నాడు శ్రీకాంత్.

ఇది కూడా చదవండి: National Games: జాతీయ క్రీడల్లో జ్యోతి హ్యాట్రిక్..! చెలరేగుతున్న తెలుగోళ్ళు

“గంభీర్, నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు తగ్గట్లు అక్షర్‌ను ఐదో స్థానంలో పెడుతున్నారు కానీ, ఇది సరైన వ్యూహం కాదు. ఈ విధంగా మార్పులు చేస్తూ పోతే, కీలక మ్యాచ్‌లో ఇబ్బంది పడుతారు. నా ఆందోళన అదే. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం మీ నిర్ణయాలను సమర్థించుకోవడం కష్టం. టాప్-4లో లేని కాంబినేషన్ నెంబర్ 5 వద్ద ఎందుకు? అక్షర్‌తో నాకు సమస్య లేదు, అతను అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.రాహుల్‌ను డౌన్ ఆర్డర్‌లో ఆడించాలనుకుంటే పంత్‌ను తీసుకోండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు?” అని శ్రీకాంత్ ప్రశ్నించాడు.

ప్రపంచ క్రికెట్‌లో ఎంతో గొప్ప ప్రదర్శనలు ఇచ్చిన ఆటగాడి పై ఇలాంటి ప్రభావం ఇలా వ్యవహరించడం సరైనదిగా కాదని చెప్తూనే. గంభీర్ చేస్తున్న పని వల్ల పంత్‌ను కూడా పక్కన పెట్టారని అంటున్నాడు. ఇక శ్రీకాంత్ అభిప్రాయపడినట్లు మూడో వన్డేలో రిషబ్ పంత్ ఆడి నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీ చెట్టులో కీపర్ గా వస్తే రాహుల్ మళ్లీ రాహుల్ మళ్లీ బెంచ్‌కు వెళ్లే అవకాశం ఉంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ గురించి ఆలోచించకుండా అత్యుత్తమ ఆటగాడిని ఐదో స్థానంలో ఆడించండి. అన్నదే నా సూచన అని క్రిష్ శ్రీకాంత్ ముగించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *