Brain Damage Foods: ఈ ఆహారాలు మెదడుకు విషపూరితమైనవి
శుద్ధి చేసిన చక్కెర
స్వీట్లు లేదా చక్కెర కలిపిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మెదడులో వాపు పెరుగుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
జంక్ ఫుడ్ – నూనెలో వేయించిన ఆహారాలు
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలలో లభించే ట్రాన్స్ ఫ్యాట్స్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
తెల్ల రొట్టె, బిస్కెట్లు, పిజ్జా, పాస్తా, మాంసాలు. సాసేజ్‌లు, సలామీలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ఆహార పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. వాటి వినియోగాన్ని కూడా తగ్గించాలి.
సోడా, చక్కెర పానీయాలు
శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన పండ్ల రసాలలో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. ఇది మెదడులోని డోపమైన్ స్థాయిలను అసమతుల్యత చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, అలసట పెరుగుతాయి.
మీ మెదడు, మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే విషపూరిత ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఆరోగ్యకరమైన మెదడుకు, మనం తినే ఆహారం చాలా ముఖ్యం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.