Digestive System

Digestive System: ఈ 8 అలవాట్లు మీకుంటే.. మీ జీర్ణ వ్యవస్థ ప్రమాదంలో ఉన్నట్టే ..

Digestive System: మన శరీరంలో జీర్ణవ్యవస్థ అనేది అత్యంత కీలకమైన భాగం. ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేసి, అవసరమైన పోషకాలను శరీరానికి అందించడమే దీని ముఖ్యమైన పని. అయితే, కొన్ని ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిలోని తప్పిదాలు ఈ సున్నితమైన ప్రక్రియను దెబ్బతీస్తాయి. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంది.

ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుకల్ప్ ప్రకాష్ సూచించినట్లు, మనం తరచుగా చేసే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా జీర్ణక్రియను ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.

1. తొందరగా తినడం

తినే వేళలో ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల కడుపు జీర్ణక్రియ కష్టతరమవుతుంది. దీని వల్ల అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నెమ్మదిగా, ఆహారాన్ని నవులుతు తినడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఆలా చేయడం వలా జీర్ణవ్యవస్థ కి ఆహారాన్ని త్వరగా అరిగించి శరీరానికి కావలిసిన పోషకాలను అందించగలదు. 

2. భోజనం దాటవేయడం

భోజనం మానేయడం వలన జీర్ణవ్యవస్థ సైకిల్ తప్పుతుంది. ఫలితంగా ఎక్కువ ఆకలి వేసి తరువాత అధికంగా తినే పరిస్థితి వస్తుంది. దీని వల్ల ఆమ్లత్వం, మలబద్ధకం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

3. అధికంగా కొవ్వు & ప్రాసెస్డ్ ఆహారాలు తినడం

వేయించిన పదార్థాలు, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దింతో యాసిడ్ రిఫ్లక్స్ కు దారితీస్తాయి.

4. తగినంత నీరు తాగకపోవడం

బాడీ హైడ్రేషన్ లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. దీని వల్ల ఉబ్బరం, మలబద్ధకం వస్తాయి. రోజంతా సరైన మోతాదులో నీరు తాగడం తప్పనిసరి.

5. అధికంగా కాఫీ & ఆల్కహాల్ తీసుకోవడం

తక్కువ మోతాదులో కెఫిన్ శరీరానికి సహాయపడుతుందేమో కానీ అధిక మోతాదులో తీసుకుంటే కడుపు గోడలు దెబ్బతింటాయి. అదే విధంగా ఆల్కహాల్ పేగు బ్యాక్టీరియాల సమతుల్యతను దెబ్బతీస్తుంది.

ఇది కూడా చదవండి: Mahesh kumar goud: “మార్వాడీ గో బ్యాక్” వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందన

6. రాత్రి ఆలస్యంగా తినడం

నిద్రకు ముందు ఎక్కువగా తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు కనీసం 2-3 గంటల ముందు భోజనం పూర్తి చేయాలి.

7. బాత్రూమ్ అవసరాన్ని వాయిదా వేయడం

శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వలన మలబద్ధకం, మూలవ్యాధి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సమయానికి మలవిసర్జన అలవాటు చేసుకోవాలి.

ALSO READ  Nara Lokesh: మెగా డీఎస్సీ గ‌డువు పొడిగింపుపై మంత్రి లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

8. అధిక ఒత్తిడి

ఒత్తిడి ఎక్కువైతే గట్-మెదడు కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. దీని వల్ల విరేచనాలు లేదా మలబద్ధకం వస్తాయి. ధ్యానం, యోగా, శ్వాసాభ్యాసాలు స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడతాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *