Vinayaka Chavithi 2025

Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Vinayaka Chavithi 2025: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాన్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అడ్డంకులను తొలగించి, జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదించే వాడు గణపతి బప్పా. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 గణేష్ చతుర్థి ఆగస్టు 27, బుధవారంన జరగనుంది. ఉదయం నుంచే భక్తులు విగ్రహ ప్రతిష్ట చేసి 10 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు.

అయితే, ఈ పవిత్ర రోజున కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. లేకపోతే గణేశుడి ఆశీర్వాదాల కంటే వ్యతిరేక ఫలితాలు కలగవచ్చని పురాణ విశ్వాసాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Vijayawada: భక్తులకు అలెర్ట్‌.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్‌.. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!

గణేష్ చతుర్థి నాడు చేయకూడని పనులు

  • చంద్రుడిని చూడకండి: ఈ రోజున చంద్రుడిని చూడడం అశుభం. ఒకసారి గణేశుడి రూపాన్ని ఎగతాళి చేసినందుకు చంద్రుడు శపించబడ్డాడనే పురాణ గాధ ఉంది. తప్పుగా చూసినా శమంతకమణి కథ చదవడం వల్ల దోషం తొలగిపోతుందని చెబుతారు.

  • విరిగిన విగ్రహం ప్రతిష్టించకండి: ఎప్పుడూ పక్కాగా ఉన్న విగ్రహాన్నే ఇంటికి తీసుకురావాలి. విరిగిన లేదా దెబ్బతిన్న విగ్రహాన్ని ప్రతిష్టించడం అశుభకరం. మట్టితో చేసిన విగ్రహాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి.

  • తామసిక ఆహారం వద్దు: ఈ రోజుల్లో మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి పూర్తిగా మానేయాలి. కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి.

  • తులసి ఉపయోగించరాదు: గణపతి పూజలో తులసి ఆకులు నిషిద్ధం. దాని బదులు గణేశుడికి ఇష్టమైన దర్భ గడ్డి సమర్పించాలి.

  • రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా పెట్టవద్దు: ఇంట్లో ఒకే విగ్రహాన్ని ప్రతిష్టించడం శ్రేయస్కరం. రెండు ఉంటే ఎదురెదురుగా ఉంచరాదు.

  • నలుపు, నీలం దుస్తులు ధరించవద్దు: పూజ సమయంలో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి శుభరంగుల దుస్తులు ధరించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: Vinayaka Chavithi 2025: వినాయక చవితికి.. ఈ 21 పత్రాలతో గణపతికి పూజ చేయండి.. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పొందండి

శుభ ఫలితాలను పొందడానికి

  • గణపతికి 21 దర్భలను సమర్పించాలి.

  • కుడుములు, ఉండ్రాళ్లు, లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి.

  • “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని జపించడం ద్వారా ప్రత్యేక శుభఫలితాలు లభిస్తాయి.

గణేష్ చతుర్థి ప్రాముఖ్యత

ఈ పండుగ మతపరంగానే కాకుండా సాంస్కృతిక పరంగా కూడా ఎంతో విలువైనది. గణేశుడి పూజతో ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, సంపద, అదృష్టం స్థిరపడతాయని నమ్మకం. ముఖ్యంగా జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోతుందని విశ్వాసం.

నోట్ : ఈ వార్తలో పొందుపరచిన వివరాలు పూర్తిగా మత విశ్వాసాలు, పండితుల సూచనలు ఆధారంగా మాత్రమే ఇచ్చబడ్డాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి మేరకే తెలియజేయబడినవి. మహా న్యూస్ తెలుగు ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *