Avika gor: ఆనంది’ పాత్ర నా రెండో పేరు లాంటిదే

Avika gor: ‘బాలికా వధు’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో ప్రతి ఇంటిలోనూ సుపరిచితమైన నటి అవికా గోర్, ‘ఆనంది’ పాత్ర తనకు తెచ్చిన గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సీరియల్ ముగిసి ఏళ్లైనా, ప్రజలు ఇప్పటికీ తనను ‘ఆనంది’గానే పిలుస్తున్నారనే విషయంపై గర్వంగా ఉందని ఆమె తెలిపింది.

ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా గోర్ మాట్లాడుతూ –

> “ప్రజలు నన్ను ఇంకా ‘ఆనంది’ అని పిలుస్తుంటే గర్వంగా ఉంటుంది. అది నా రెండో పేరులా మారిపోయింది. ఈరోజే ఎయిర్‌పోర్టులో ఒక ఆంటీ నా దగ్గరికి వచ్చి ‘ఆనంది’ అని ప్రేమగా పిలిచింది. ఆ పాత్రే నన్ను దేశంలోని ప్రతీ కుటుంబానికి దగ్గర చేసింది. ఎంతోమందికి నన్ను కూతురిని చేసింది. ఆ బంధాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను,” అని పేర్కొంది.

ఇక తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో రియాలిటీ షో *‘పతి పత్నీ ఔర్ పంగా’*లో పెళ్లి చేసుకోవడంపై అవికా స్పందిస్తూ – “షోలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే విమర్శలు వస్తాయని మాకు తెలుసు. కానీ నా జీవితంలో ఎప్పుడూ భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను. నా దారిని నేనే నిర్మించుకోవాలనే నమ్మకం నాకుంది,” అని చెప్పింది.

అవికా గోర్ తన కెరీర్‌పై మాట్లాడుతూ – “నా ప్రయాణం సులభం కాదు. కానీ నా జీవితం చూసి చాలామంది కలలు కంటారు, దానిపట్ల నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను,” అని తెలిపారు.

‘బాలికా వధు’ తర్వాత ‘ససురాల్ సిమర్ కా’ వంటి సీరియల్స్‌తోనూ, ఆపై సినీ రంగంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా, తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *