AUS vs WI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆసీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేసారు. కేవంల 141 పరుగులకే వెస్టిండీస్ టీమ్ ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ షమార్ జోసెఫ్ (44) ఒక్కడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. జస్టిన్ గ్రీవ్స్ (38), జాన్ క్యాంప్‌బెల్ (23), కీసే కార్టీ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (4), బ్రాండన్ కింగ్ (0), రోస్టన్ ఛేజ్ (2), షై హోప్ (2), అల్జారీ జోసెఫ్ (0), జోమెల్ వారికన్ (3), సీల్స్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 5, నాథన్ లయన్ 2.. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇది కూడా చదవండి: ICC New Rules: టెస్ట్ క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్స్.. మాములుగా లేవుగా
విండీస్ 159 పరుగుల తేడాతో ఓడిపోవడంతో హాజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించాడు. హాజిల్‌వుడ్ 12 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియన్ పేసర్ 74 మ్యాచ్‌ల్లో 24.39 సగటుతో 288 టెస్ట్ వికెట్లు తీసుకున్నాడు. అతను తన 13వ ఐదు వికెట్ల రికార్డును నమోదు చేసుకున్నాడు. విదేశీ టెస్టుల్లో (ప్రత్యర్థి జట్టు స్వదేశంలో) ఈ పేసర్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది ఆరోసారి. విదేశీ మ్యాచ్‌ల్లో అతను 26.50 సగటుతో 118 వికెట్లు పడగొట్టాడు. అతను తీసిన 118 వికెట్లలో 19 వికెట్లు వెస్టిండీస్‌లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 310 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 180కే ఆలౌట్ కాగా.. విండీస్ 190 పరుగులు చేసింది.

