Australia: ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం పదిమందికిపైగా

Australia: ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బాండీ బీచ్‌లో శుక్రవారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరపడంతో బీచ్ ప్రాంతం భయాందోళనకు గురైంది. ఈ ఘటనలో పదిమందికిపైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

జరిగిన కాల్పులతో బీచ్‌లో ఉన్న పర్యాటకులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగులపై ప్రతికాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక దుండగుడు మృతి చెందగా, మరొక దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కాల్పుల వెనుక కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో బాండీ బీచ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ కాల్పుల ఘటన ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *