Atti Satyanarayana

Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన … కామెంట్స్

Atti Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌ థియేటర్ల బంద్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ల బంద్ పై సంచలన కామెంట్స్ చేశారు. దీని వెనక జనసేన ప్రముఖ నేత, రాజమండ్రి నగర ఇంఛార్జి, అనుశ్రీ ఫిల్మ్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్యనారాయణ‌ను పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అదేవిధంగా సత్య నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. తాజాగా దీనిపై స్పందించారు అత్తి సత్యనారాయణ. ఈరోజు మీడియా ముందుకు వచ్చిన ఆయన దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేశారు.

థియేటర్ల బంద్ విషయంలో దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకునేందుకు దిల్ రాజు నా పేరు చెప్పారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు. ఒక జర్నలిస్టు అడిగిన దానికి సినిమాలు లేక థియేటర్లు మూసి వేయాల్సి వస్తుందనీ అన్నాను. జూన్ 1న థియేటర్ల బంద్ చేయిస్తామని దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తొడగొట్టి చెప్పారు. ఇప్పుడు ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు నాపై అభాండం వేశారు. దిల్ రాజు ఆస్కార్ నటుడి రేంజ్ లో నటించారు. కమల్ హాసన్ ను మించి యాక్ట్ చేస్తున్నారు. నా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాను నేను ఎందుకు అడ్డుకుంటాను. దిల్ రాజు నైజాం నవాబులా ఏలుదాము అని అనుకుంటున్నాడు. త్వరలోనే నిజ నిజాలు తెలుస్తాయి అని అత్తి సత్యనారాయణ అనారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth Reddy: అమ్మ పేరుతో మొక్క నాటండి, పిల్లల పేరుతో మొక్కలు పెంచండి.. వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *