Mohammed Shami

Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు

Mohammed Shami: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్, ఆమె కూతురు అర్షి జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని సూరి పట్టణంలో పొరుగున ఉన్న ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న దాలియా ఖాతూన్ అనే మహిళపై దాడికి పాల్పడినట్లు హసీన్ జహాన్, అర్షి జహాన్ లపై ఆరోపణలు ఉన్నాయి. సూరిలోని వార్డు నంబర్ 5లో ఉన్న ఒక భూమి వివాదమే ఈ ఘర్షణకు దారి తీసిందని సమాచారం.

ఈ భూమి అర్షి జహాన్ పేరుపై ఉందని హసీన్ జహాన్ వాదిస్తున్నారు. ఈ వివాదాస్పద స్థలంలో హసీన్ జహాన్ నిర్మాణం చేపట్టగా, పొరుగువారు దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఘర్షణ చెలరేగి, అది శారీరక దాడికి దారితీసింది. ఈ దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హసీన్ జహాన్ తన పొరుగున ఉన్న మహిళను తోసేస్తున్నట్లు, దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది.

Also Read: BCCI Pension: నెలకు 70 వేల పెన్షన్ ..కానీ ఒక్క షరతు

దాలియా ఖాతూన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హసీన్ జహాన్, అర్షి జహాన్ లపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని వివిధ సెక్షన్ల కింద, ముఖ్యంగా హత్యాయత్నం (attempt to murder) సెక్షన్లతో సహా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహ్మద్ షమీ, హసీన్ జహాన్ గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వారి విడాకుల కేసు కూడా ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *