attack-on-kovur-ex-mla-nallapareddy-prasanna-kumar-reddy-house-2025-07-08-06-42-21

EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి – ఫర్నీచర్, కారు ధ్వంసం

EX MLA Prasanna Kumar Reddy: నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారు. ఈ ఘటన నగరంలోని సావిత్రినగర్‌లో జరిగింది.

దాడి వెనుక రాజకీయ కారణాలేనా?

సోమవారం మధ్యాహ్నం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. దీనితో ఆగ్రహించిన కొంతమంది, ఆయన ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఇంట్లోని వస్తువుల ధ్వంసం

దుండగులు ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కారును ధ్వంసం చేసి, ఇంట్లో విలువైన వస్తువులను పగలగొట్టారు. దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం.

వైసీపీ నేతల ఆగ్రహం

ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు నేతలు నల్లపురెడ్డి ఇంటికి వెళ్లారు.
వీరంతా వేమిరెడ్డి దంపతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘పదవుల మదంతోనే వేమిరెడ్డి దంపతులు ఈ దాడి చేయించారని అనుమానాలు ఉన్నాయి’’ అని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

హత్యాయత్నం కేసు డిమాండ్

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ‘‘రాజకీయంగా ఎదురు నిలబడలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని అనిల్ కుమార్ అన్నారు.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

ఈ ఘటనపై నెల్లూరు పోలీస్‌ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral News: ఐటెం రాజాలు కావాలి...ఇదెక్కడి స్కామ్‌ రా మావా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *