Canada: కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. కెనడా బ్రాంప్టన్‌లోని ఆలయంలో వెలుపల హిందూ భక్తులపై జరిగిన దాడి కలకలం రేపింది. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ మండిపడింది. హిందువులరి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసర సేవలు అందకుండా ఇలాంటి చర్యలతో అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యింది. కాగా, కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు పరిధులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు.
హిందూ దేవాలయంపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చంద్ర ఆరోపించారు. మరోవైపు, దాడి జరిగినప్పుడు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖలిస్థానీ మద్దతుదారుల బృందం ఒక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు నివేదికలు సూచించాయి.