Prakasam District: చంపేయాలి అనుకున్నాడు. పెట్రోల్ పోసాడు . నిప్పు పెట్టాడు. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి. అసలు ఎందుకు చంపాలి అనుకున్నాడు. రక రకాల కారణాలు. అందుకోసమే అని కొందరు..కాదు కాదు దీని కోసమే అని మరి కొందరు. భూ వివాదమైనా..మరో కారణమైనా మొత్తానికి చావు బ్రతుకుల మధ్య ఆ యువకుడు ఉన్నాడు.
ఓ యువకుడిపై మరో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన అమానవీయ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దోర్నాల మండల పరిధిలోని పెద్ద బొమ్మలాపురంలో నివాసం ఉంటున్న నాగుర్ వలీ అనే యువకుడు మరో యువకుడిపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈ దుర్ఘటనలో బాధిత యువకుడి శరీరం 80 శాతం కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో నిందితుడు నాగూర్ వలీ తో పాటు మరో మహిళకు గాయలయ్యాయి. అయితే, యువకుడిపై దాడికి కారణం స్థల వివాదమేనని ప్రధాన కారణంగా తెలుస్తోంది. బాధిత యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
అయితే, దీనికి ముందు పెద్దబొమ్మలాపురం గ్రామంలో ఇరువురు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పాత కక్షల నేపథ్యంలో స్థలాల దగ్గర వివాదం ఎప్పటినుంచే కొనసాగుతుంది.. దీంతో ఈ ఘర్షణకు కారణమైందని తెలుస్తోంది. పోలీసులు కూడా ఇదే కోణం దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
