Crime News: అప్పు ఇవ్వడమే పాపం అయిపోయింది. ఇచ్చిన అప్పు ..అప్పుడు ఇస్తావ్ అని అడిగినందుకు …ఏకంగా కత్తితో చంపేయబోయాడు. అది కూడా ముసలివాళ్లను. ఇది కరెక్ట్ ఏనా. వీడి దృష్టిలో అప్పు ఇవ్వడం వరకే ..తిరిగి ఇచ్చేది లేనిది నా ఇష్టం అన్నట్లు ఉంది. కానీ ఇప్పుడు ఐతే బాగా అయింది వీడికి . కేసు పెట్టి లోపలేశారు పోలీసులు.
తన తండ్రి వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఓ వివాహిత భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మామ తీవ్రగాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి బంగారం పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొవ్వూరు మండలం వాడపల్లి బంగారంపేటకు చెందిన అడ్డాల నాగయ్యకు ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. వారందరికీ వివాహాలయ్యాయి. నాగయ్య నెలకు ఒకరి వద్ద ఉంటూ స్థానికంగా కూలి పనులు చేసుకోని జీవనం సాగిస్తున్నారు.ఆయన రెండో కుమారై కృష్ణతులసికి మొదటి ఒక వివాహం జరగ్గా రాము అనే కుమారుడు ఉన్నాడు. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత నాలుగేళ్ల కిందట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రాజుగూడేనికి చెందిన మురళీకృష్ణతో వివాహమైంది. అక్కడ ఉండలేక కృష్ణతులసి కుమారుడితో కలిసి ఆరునెలల క్రితం బంగారం పేటకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
Also Read: Visakhapatnam: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..
మురళీకృష్ణ కూడా బంగారంపేటకు వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ వేరుగా ఉంటున్నాడు. ఆయన నాగయ్య వద్ద 50 వేల రూపాయలను అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని కృష్ణ తులసి మురళీకృష్ణను కలిసి అడిగారు. దీంతో ఆయన కోపంతో ఆమెపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడికి దిగాడు. అది గమనించి అడ్డుకునేందుకు వెళ్లిన నాగయ్యపైనా దాడికి తెగబడ్డాడు. ఆయనను మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. తల్లి చనిపోవడం, తాతయ్య తీవ్రంగా గాయపడడం, తండ్రి జైలుపాలు కావడంతో రాము తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కృష్ణతులసి కుటుంబ సభ్యుల రోదనలతో బంగారంపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.