Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్, కార్పొరేటర్ సుజాత మధ్య హనీమూన్ నడుస్తుందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ కేసుకు కారణంగా మారాయి.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌తో కార్పొరేటర్ సుజాతకు హనీమూన్ నడుస్తుందని సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తుండగా, ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనపై అధికారికంగా కేసు నమోదైంది.
