Atlee Kumar

Atlee Kumar: ఆ ఇద్దరు స్టార్స్ తో అట్లీ మూవీ!

Atlee Kumar: అగ్ర కథానాయకులు సైతం ప్యాడింగ్ కోసం వేరే భాషల్లోని స్టార్ ను తమ చిత్రాలలో నటింప చేస్తున్నారు. బాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనూ ఈ ట్రెండ్ కొంతకాలంగా నడుస్తోంది. హిందీ చిత్రసీమలోకి ‘జవాన్’ మూవీతో అడుగుపెట్టిన తమిళ దర్శకుడు అట్లీ ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తోనే మరో సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి కబురేదీ ఈమధ్యలో రాలేదు. అయితే అట్లీ సౌతిండియన్ స్టార్ హీరో రజనీకాంత్, బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తీయబోతున్నాడనే వార్త ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య అట్లీ తాన తదుపరి చిత్రం కాంబినేషన్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, అవుట్ ఆఫ్ ద వరల్డ్ సబ్జెక్ట్ తో దానిని తీయబోతున్నానని అన్నాడు. అది రజనీ, సల్మాన్ మూవీనే అయి ఉంటుందనే ఊహాగాలు మొదలయ్యాయి. ఈ మధ్య అట్లీ తన ‘తేరి’ చిత్రాన్ని హిందీలో ‘బేబీ జాన్’గా రీమేక్ చేసి నిర్మాతగా వ్యవహించాడు. కానీ ఆ చిత్రం ఉత్తరాదిన పరాజయం పాలైంది. మరి నిర్మాతగా ఫెయిల్ అయిన అట్లీ ఇప్పడీ మల్టీస్టారర్ తో దర్శకుడిగా మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *