Olympics

Olympics: ప్రతిభకు ప్రోత్సాహం, గుర్తింపు ఇక్కడ..? మన తెలుగు వజ్రాన్ని పారేసుకుంటున్నారు?

Olympics: ఒలింపిక్స్  ఆసియా క్రీడలలో పాల్గొన్న తొలి తెలుగు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఆమె. విశాఖ ఎక్స్‌ప్రెస్ అని పిలువబడే ఈ తెలుగు అమ్మాయి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినప్పటికీ, స్వరాష్ట్రంలో ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. ఆసియా క్రీడల నుండి జాతీయ క్రీడల వరకు అనేక పతకాలు  రికార్డులు సాధించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆమెకు సరైన మద్దతు లభించలేదు. రైల్వేలో వచ్చే జీతం చాలీచాలని, వయసు మీద పడిన తల్లిదండ్రుల బాధ్యతలు,  రెండు గదుల ఇరుకైన ఇంట్లో కనీసం పడుకోడానికి కూడా స్థలం లేకుండా ఇబ్బందులు పడుతున్న భారత స్టార్ అథ్లెట్ యర్రాజి జ్యోతి కష్టాల గురించి తెలుసుకుందాం.

విశాఖపట్నంలోని కైలాసపురం, మధుసూదన్ నగర్‌లో రెండు గదుల ఇరుకైన ఇంట్లో జ్యోతి కుటుంబం నివసిస్తున్నారు. ఇంట్లోని సామానుల మధ్యే ఐదుగురు రెండు గదుల్లో ఇరుక్కొని పడుకుంటారు. నాన్న సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా ఆరు వేల రూపాయల జీతానికి పనిచేస్తాడు. అమ్మ కొద్ది నెలల కిందటి వరకు నాలుగిళ్లలో పనిచేసేది. ఆమె ఆరోగ్యం బాగుండకపోవడంతో పని మాన్పించారు.

అన్నయ్య సురేష్ పోర్టులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పడుకోవడానికి తగినంత స్థలం లేకుండా అన్నయ్య ఎక్కువ నైట్ డ్యూటీలకు వెళ్తుంటాడు. జ్యోతి ప్రస్తుతం రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా రూ. 25 వేల జీతానికి ఉద్యోగం చేస్తున్నా, నాన్న  అన్నయ్య సంపాదనతో ఇల్లు గడుస్తోంది. తనకొచ్చే జీతం నా శిక్షణ ఖర్చులకు కూడా సరిపోవు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని పట్టించుకునేవారే కరువయ్యారు.

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: కోచ్ vs చీఫ్ సెలెక్టర్? ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గంభీర్, అగార్కర్ లకు కుదరట్లేదా?

క్రికెటర్లకు భారీస్థాయిలో పురస్కారాలు  నజరానాలు అందుతున్నాయి. కానీ ఈమె లాంటి అథ్లెట్లకు మాత్రం మొండి చెయ్యి మిగులుతుంది. ప్రపంచంలో ఒలింపిక్స్ కంటే ప్రతిష్ఠాత్మకమైన క్రీడా పోటీలు ఏమి ఉంటాయి? అలాంటి ఒలింపిక్స్‌లో ఆమె గత ఏడాది గాయాన్ని కూడా లెక్క చేయకుండా పాల్గొంది. 2022 ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత, తెలుగు అథ్లెట్‌గా చరిత్ర సృష్టించినా, ఆమె కష్టాన్ని గుర్తించినవారు లేరు. ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో (2023) 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం  200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు సాధించింది.

ఈ పోటీల్లో స్వర్ణం సాధించిన తొలి భారత, తెలుగు అథ్లెట్‌ను కూడా ఈమెనే. వరుసగా మూడు జాతీయ క్రీడల్లో స్వర్ణం  రజత పతకాలు సాధించినా, ఐదుసార్లు జాతీయ రికార్డులు నెలకొల్పినా, గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సరైన రీతిలో గుర్తించలేదు. ఉద్యోగం  ఇంటి స్థలం కోసం ఎన్ని దరఖాస్తులు పెట్టినా అవి బుట్టదాఖలే అవుతున్నాయి.

ALSO READ  Telugu Titans: తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయా

మరి ఇలాంటి వారికి సరైన శిక్షణా  సదుపాయాలను అందిస్తే ఒలింపిక్స్ లో పథకం సాధించి తెలుగుజాతి ఖ్యాతిని మరింత పెంచుతారు. ఇలా ఆర్థిక సహకారం లేక ఎంతో మంది జ్యోతిలు ఇంటిలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు వారిలో ఏదో ఒకటి దేశానికి సాధించాలి అన్న పట్టుదల  టాలెంట్ ఉన్నప్పటికీ వెనుకబడుతుండడం నిజంగా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *