Athadu

Athadu: ‘అతడు’ రీ-రిలీజ్: ఈసారి రికార్డులు జర కష్టమే.. ఎందుకంటే?

Athadu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ‘అతడు’ ఒక మైలురాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైనప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు రీమాస్టర్డ్ వెర్షన్‌తో ఆగస్టు 9న మహేష్ అభిమానులకు పండగలా రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమా కల్ట్ స్టేటస్‌తో పాటు అనేక రికార్డులను సృష్టించింది. మహేష్ బాబు డైనమిక్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ మాటల మాయాజాలం, మణిశర్మ సంగీతం ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.

Also Read: Janaki VS State Of Kerala: అనుపమ దెబ్బకి వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డ్..

అయితే, ఈ రీ-రిలీజ్‌కు కొత్త సినిమాల పోటీ గట్టిగానే ఉంది. ‘కింగ్‌డమ్’, ‘వార్ 2’, ‘కూలీ’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను ఆక్రమించే అవకాశం ఉంది. ఈ పోటీలో ‘అతడు’ ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది? థియేటర్స్‌లో ఎన్ని రోజులు రన్ అవుతుంది? మహేష్ అభిమానుల ఉత్సాహం ఈ చిత్రాన్ని మరోసారి సక్సెస్‌ఫుల్‌గా నిలబెడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కానీ ‘అతడు’ మరోసారి బాక్సాఫీస్‌ను రణరంగంగా మార్చేందుకు సిద్ధంగా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *