Athadu: మహేష్ బాబు అతడు మూవీ రీ-రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో, జయభేరి సంస్థ నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్.. టెలివిజన్ హిస్టరీలో ట్రెండ్ సెట్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా మీమ్స్ కి సాలిడ్ స్టఫ్ ఇచ్చిన ఈ సినిమా, వచ్చే నెల 10 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. రీసెంట్ గా 4k ట్రైలర్ రిలీజ్ చేశారు..
Also Read: Mahavatar Narsimha OTT: రయ్ మంటున్న మహావతార్ నరసింహ ఓటిటి రైట్స్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జూలై 30న మహేష్ ఫస్ట్ ఫిల్మ్ రాజకుమారుడు రిలీజై 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. అతడు రీ రిలీజ్ 4k ట్రైలర్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. లేటెస్ట్ టెక్నాలజీతో, 4k వెర్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో కట్ చేసిన ట్రైలర్ క్లారిటీతో బాగుంది. ఈ సౌండ్ థియేటర్లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.. 20 ఏళ్ల క్రితం 2005 ఆగస్టు 10న విడుదల చెయ్యగా.. ఈసారి మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది అతడు..