Athadu: సూపర్ స్టార్ మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ ‘అతడు’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. యూఎస్‌లో ఇప్పటికే భారీ క్రేజ్‌తో వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం, మహేష్ మ్యాజిక్‌ను మరోసారి చాటనుంది. ఈ రీరిలీజ్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.
Also Read: Samyuktha Menon: స్టార్ హీరో కి జోడీగా సంయుక్త..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా మరోసారి థియేటర్లలో అలరించడానికి సిద్ధమైంది. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం రీరిలీజ్‌కు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ రూపంలో 10 వేల డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ రీరిలీజ్ అభిమానులకు పండగలా మారనుంది. గతంలో ‘ఖలేజా’ రీరిలీజ్‌తో యూఎస్‌లో రికార్డులు సృష్టించిన మహేష్, ఈసారి ‘అతడు’తో ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తాడనేది ఆసక్తికరం. ఈ చిత్రం హైప్, క్రేజ్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

