Atchannaidu: మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు అవుతుందో లేదో తెలియాలంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీరలు కట్టుకుని బస్సు ఎక్కితే తెలుస్తుంది” అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం 9 వేల బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. అంతేకాకుండా, వృద్ధాప్య పింఛన్‌ను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయడం తగదని అచ్చెన్నాయుడు అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని, ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.