Atchanaidu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు సకాలంలో రెండు పంటలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం వ్యవస్థకు తాళం వేశారని ఆరోపించారు.
వంశధార నది వివాదంపై స్పందించిన ఆయన, ఇందుకు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. వంశధార–నాగావళి నదుల అనుసంధాన ప్రాజెక్టు పనుల్లో 70 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు అనుగుణంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

