Hyderabad: మధురానగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్‌లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్‌లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. హైటెక్ సిటీ క్రాస్ రోడ్ వద్ద ఓ భవనంలో పనిముగించుకుని వచ్చిన మహిళను… బట్టలు ఉతికే పని ఉందని మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు తీసుకెళ్లారు.
గదిలో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కేకలు విని పక్కింటి మహిళ రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు పట్టుకోగా… మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.