assam

Assam: ఆకస్మిక వరదలు.. బొగ్గుగనిలో చిక్కుకుపోయిన కార్మికులు

Assam: వరదల కారణంగా అస్సాంలోని బొగ్గు గనిలో పెద్ద సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. డిమా హసావో జిల్లా ఉమ్రాంగ్సోలో ఒక బొగ్గు గని ఉంది. ఎప్పటిలాగే ఈ గనిలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ అనూహ్యంగా గనిలోకి వరద వచ్చి చేరింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురైన కార్మికులు తప్పించుకునే మార్గంలేక లోపలే చిక్కుకుపోయారు. 20 మందికి పైగా కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: HMPV Virus: ఇండియాలో పెరుగుతున్న HMPV వైరస్.. తమిళనాడులో 2 పాజిటివ్ కేసులు

Assam: ఈ విషయంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. భారీ యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్స్‌లో నిమగ్నమై ఉన్నారు. జిల్లా ఎస్పీ మయాంక్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ: గనిలో చాలా మంది చిక్కుకున్నారని మాకు తెలుస్తోంది. అయితే కచ్చితంగా  లోపల ఎంతమంది చిక్కుకుపోయారన్న సమాచారం లేదు. అందరినీ రక్షించే పనిలో ఉన్నాం అని చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *